తాలిబన్ ప్రభుత్వంలో లుకలుకలు.. అజ్ఞాతంలోకి ముల్లా బ‌రాద‌ర్

తాలిబన్ ప్రభుత్వంలో లుకలుకలు.. అజ్ఞాతంలోకి ముల్లా బ‌రాద‌ర్

తాలిబన్ ప్రభుత్వంలో లుకలుకలు.. అజ్ఞాతంలోకి ముల్లా బ‌రాద‌ర్

ఆఫ్గానిస్తాన్ లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటైయందో లేదో.. అప్పుడే తాలిబ‌న్ ప్ర‌భుత్వంలో లుకలుకలు ఏర్పాడ్డాయి..తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన వెంట‌నే తాలిబ‌న్ అగ్రనేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఆఫ్గానిస్తాన్ ప్ర‌భుత్వ ఏర్పాటులో నేతల కూర్పు నచ్చకనే ఆ కీల‌క నేత అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు సమాచారం. ఆఫ్గానిస్తాన్ లో ప్ర‌భుత్వం ఏర్పాటుకు ముందు ముల్లా బ‌రాద‌ర్ పేరు చాలా సార్లు వినిపించింది. అయితే, ప్ర‌భుత్వం ఏర్పాటు స‌మ‌యంలో ఆఫ్గానిస్తాన్ కు ముల్లా మ‌హ‌మ్మ‌ద్ హ‌స‌న్ ప్ర‌ధాని అయ్యారు. తన ప్రభుత్వ ఏర్పాటుతో హుక్కానీల‌కు పెద్దపదవులలో వారికే పెద్దపీట వేశారు.

గ‌తంలో దోహాలో జ‌రిగిన స‌మావేశంలో తాలిబ‌న్లు ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే ప్ర‌భుత్వంలో హ‌మీద్ క‌ర్జాయ్‌, అబ్దుల్లా అబ్ధుల్లా వంటి ప్ర‌ముఖుల‌కు ప్ర‌భుత్వంలో అగ్ర స్థానం క‌ల్పించాల‌ని, వారి విలువైన సేవ‌లు వెలకట్టలేనివని.. అందుకే దేశానికి వీరి సేవలు చాలా అవ‌స‌ర‌మ‌ని ఒప్పందం జ‌రిగింది. అయితే, ఈ ఒప్పందాన్ని ప‌క్క‌న పెట్టి హ‌మీద్ క‌ర్జాయ్‌, అబ్ధుల్లా అబ్ధుల్లా ల‌కు స్థానం క‌ల్పించ‌క పోవ‌డంతో పాటుగా ప్ర‌భుత్వం ఏర్పాటులో పాక్ ఐఎస్ఐ జోక్యం చేసుకోవ‌డంతో బ‌రాద‌ర్ కాబూల్ విడిచి కాంద‌హార్ వెళ్లిపోయార‌ని వార్త‌లు హల్ఛల్ చేస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ముల్లా బ‌రాద‌ర్ మీడియాలో, ప్రెస్ మీట్‌ల‌లో రావడం లేదు. ప్ర‌భుత్వం ఏర్పాటైన వెంట‌నే లుక‌లుక‌లు మొద‌లుకావ‌డంతో తాలిబ‌న్లు ఎంత‌కాలం పరిపాలిస్తారో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *