రోజు ప్రొద్దున్నే ఈ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

రోజు ప్రొద్దున్నే ఈ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

రోజూ పరగడుపునే ఈ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా ?

పూర్వ కాలం నుంచి మనకు బార్లీ గింజలు అంటే తెలియని వాళ్లు లేకపోలేరు. బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం నిత్యం బార్లీ గింజలు పరిగడపున బార్లీ గింజల జావా తాగితే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్, కొవ్వు తగ్గుతుంది. మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆహారాల్లో బార్లీ ఒకటి.

బార్లీని వృధాగా పోనివ్వకూడదనుకుంటే బార్లీ గింజలను, వాటిని వేసి ఉడికించిన నీళ్లతో సహా తీసుకోవాలి. బార్లీ వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయి.

బార్లీలో ఉండే విటమిన్-బి ఉంటుంది. ఇది నీటిలో కరిగే తత్వం కలిగి ఉంటుంది. బార్లీలో బి-విటమిన్లు, పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగం పొట్టుపైనే ఉంటాయి కాబట్టి బి విటమిన్ కావాలనుకునేవారు బార్లీ గింజలను యధాతథంగా వాడగలిగితేనే మంచిది.

బార్లీ గింజల నీళ్లను ఉదయం పరగడుపునే తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం అనేవి తగ్గుతుంది. దీంతో జీర్ణక్రియ మరింత మెరుగు పడుతుంది. అధిక బరువు ఉన్నవారు ఇట్టే తగ్గుతారు. బార్లీని నీళ్ళలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది.

చాలా మందికి జర్వాలు వచ్చినప్పుడు శరీర భాగాల్లో కాళ్లు కానీ, మొహం కానీ ఉబ్బినట్లుగా వస్తుంటుంది. అలాంటప్పుడు బార్లీ చక్కని ఆహార ఔషధంగా వాడొచ్చు.

ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు బాగా నీరసించిపోతున్నారు. ఆ పిల్లలకు బార్లీని పాలతోగాని లేదా పండ్ల రసంతో గాని కలిపి ఇవ్వాలి. అప్పుడు జ్వరంతో పాటుగా నీరసం ఉంటుంది. అలాంటప్పుడు బార్లీ కషాయానికి గ్లూకోజ్ కలిపి ఇస్తే వెంటనే శక్తి వస్తుంది.

బార్లీ నీళ్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

కొలెస్ట్రాల్‌, షుగర్ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నవారు బార్లీ నీళ్లను తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది.

బార్లీ నీళ్లను తాగితే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. కిడ్నీ స్టోన్స్ సైతం కరిగిపోతాయి. మళ్లా ఏర్పడకుండా ఉంటాయి.

బార్లీ గింజలను జావాగా తయారుచేసి, మజ్జిగ, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధుల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మూత్రం జారీ అవటం వల్ల శరీరంలో వాపు దిగుతుంది.

మూత్ర విసర్జన కష్టంగా ఉంటే బార్లీ కషాయానికి బెల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.

బార్లీని పాలతో కలిపి తీసుకుంటే.. బాలింతల్లో పాలు ఎక్కువగా వస్తాయి.

గర్భిణీలకు ఒంటికి నీరు చేరితే బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గి ఉత్సాహాన్నిస్తుంది.

బార్లీని రవ్వలాగా, మెత్తటి పిండిలా చేసి దానితో ఫలహారాలను చేసి తింటే త్వరగా, తేలిగ్గా జీర్ణమవుతాయి.

బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బార్లీ నీళ్లను ఇంట్లో ఇలా తయారు చేసుకోండి

కావల్సిన పదార్థాలు

బార్లీ గింజలు – పావు కప్పు

నీళ్లు – 4 కప్పులు

ఉప్పు – చిటికెడు

తేనె – తగినంత

నిమ్మరసం – తగినంత

తయారు చేసే విధానం: పాత్రలో నీటిని తీసుకుని అందులో బార్లీ గింజలను వేసి మరిగించాలి. తరువాత ఉప్పు వేసి 15-20 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. తరువాత నీటిని వడకట్టి అందులో నిమ్మరసం, తేనె కలిపి చల్లగా అయ్యాక తాగాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో కొవ్వు, ఊబకాయం బాగ తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *