9 రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఏ రోజు ఏ పూజ చేస్తారు..?

9 రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఏ రోజు ఏ పూజ చేస్తారు..?

తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో, రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.

ఎంగిలిపూల బతుకమ్మ: మహాలయ అమవాస్య రోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాసమని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఇదే రోజు పితృ దేవతలకు పూజలు.. పండితులకు దానాలు ఇస్తారు.

అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పూజ దేవీశరన్నవరాత్రుల నుంచే ప్రారంభమవుతాయి.

ముద్దపప్పు బతుకమ్మ: ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మను ఆరాధిస్తే ఆరోగ్యం, బోగభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు తెలంగాణ ఆడబిడ్డలు

నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. పెద్దమ్మలతో ఈరోజు పడుచు పిల్లలు ఓణీలతో సోయ సొగసలు వెలగబోస్తూ ఆటపాట ఆడుతూ వరసైన బావలన్నీ ఆట పట్టిస్తుంటారు. దోసలు తినమని బావలన్నీ బాగా ఆటపట్టిస్తుంటారు.

అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు. ఎందుకంటే ఈరోజు బతుకమ్మ అలిగి వెళ్లిపోతుందట. పురాణాలలో చెప్పబడ్డాయి.

వేపకాయల బతుకమ్మ: బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమినాడు అదేరోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

ఈ 9 రోజులలో పెరగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం, మొక్కజొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు నైవేద్యంగా సమర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *