తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు

ప్రతి ఊరిలో మైదానాలు, చెరువులు సిద్ధం చేయాలని ఆదేశం

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ‌లో ఇవాళ్టి నుంచి బ‌తుక‌మ్మ పండ‌గ సంబ‌రాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ పండుగకను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్ర‌తి ఏడాది బ‌తుక‌మ్మ పండ‌గ సంబ‌రాలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు. అయితే గ‌తేడాది క‌రోనా మహామ్మారి కార‌ణంగా ఈ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించలేకపోయారు. ప్రభుత్వం తరఫున కూడా ఈ బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయలేకపోయారు. అయితే, క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండ‌టంతో ఈసారి బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పండుగను 9 రోజుల‌పాటు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూల‌తో బ‌తుక‌మ్మ పండుగ మొదలయ్యి చివ‌రిరోజు స‌ద్దుల బ‌తుక‌మ్మ‌తో బతుకమ్మ వేడుక‌లు ప‌రిస‌మాప్త‌మ‌వుతాయి. అయితే ఈ బతుకమ్మ పండుగను  ప్ర‌తీ ఊరిలోనూ ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే ఈసారి బ‌తుక‌మ్మ‌ల కోసం మైదానాలు చెరువుల‌ను ప్ర‌భుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బ‌తుక‌మ్మ‌ను చెరువులో నిమ‌జ్జ‌నం చేసేందుకు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బ‌తుకమ్మ పండుగ జరుపుకునే మహిళలు,  రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *