ప్రతిరోజూ ఈ రసం తాగండి.. ఆ సమస్యల నుంచి తప్పించుకోండి.

ప్రతిరోజూ ఈ రసం తాగండి.. ఆ సమస్యల నుంచి తప్పించుకోండి.

ప్రతి రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్ ఈ రసం తాగితే…ఆ రోజంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దగా ఎక్సైసైజ్ లు చెయ్యకపోయినా…ఈ రసం తాగితే… మీ ఒంట్లో చెడు కొవ్వును కరిగించేస్తుందటా మరీ దీని సంగతేంటో చూద్దామా మరీ..

సాధారణంగా ఉదయాన్నే లేవగానే ఓ గ్లాస్ గోరువెచ్చటి మంచినీళ్లు తాగాలని చెబుతుంటారు. అయితే దీనికి భిన్నంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఓ గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే…ఆ రోజంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దగా వ్యాయామం చెయ్యకపోయినా గ్లాస్ దానిమ్మ జూస్ తాగితే  ఒంట్లో చెడు కొవ్వును కరిగించేస్తుంది. ఈ జ్యూస్ ఆరోగ్యకరమైన పానీయంగా చెబ్పబడుతుంది. సాధారణంగా మానవ దేహానికి పండ్ల రసం లేదా కూరగాయల రసం ఒక గ్లాసు తాగితే మనల్ని తక్షణమే ఊరట లభిస్తుంది. ఈ జ్యూస్ లలో విటమిన్లు, ఖనిజాలతో పాటుగా మరెన్నో ఉంటాయి. అయితే దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా దానిమ్మ ఆరోగ్య ప్రయోజనాలు మరెన్నో ఉన్నాయి.

దానిమ్మలో ఫైబర్ ఎక్కువ: దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. రక్తంలో పేరుకుపోయిన చెడును తొలగిస్తుంది. శరీరం సన్నబడటానికి సహాయపడుతుంది. శరీరంలో గడ్డకట్టుకుపోయిన గడ్డల్నీ కరిగిస్తుంది.

దానిమ్మ రసం షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది : డయాబెటిక్ రోగులు దానిమ్మ రసాన్ని మితంగానే తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడంలో దానిమ్మ రసం ఎంతగానో సహాయపడుతోంది. ఈ రసం తాగడం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. డయాబెటిక్ రోగులు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి.

క్యాన్సర్‌ను కంట్రోల్ ఉంచుతుంది: దానిమ్మ రసంలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లుతో పాటుగా ఫైబర్ అనేది ఉంటుంది.ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన కణాలను దెబ్బతీసే మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో  ఎంతగానో సహాయపడతాయి. క్యాన్సర్ తో సహా పలు సైడ్ ఎఫ్టెక్ట్ లను కూడా నివారించొచ్చు దానిమ్మ రసం రోజూ తాగడం ద్వారా, మీరు క్యాన్సర్‌ను నివారించవచ్చు.

దానిమ్మ రసం కీళ్లనొప్పులను నివారిస్తుంది: సాధారణంగా దానిమ్మను చాలామంది ఇష్టపడరు. కానీ దానిమ్మ రసంలో ఫైబర్, ఫ్లేవనాల్స్ ఉండం వల్ల..  పట్టుత్వం కోల్పోయిన ఎముకలు, కాళ్లు, కీళ్లలో ఉండే మంటను నివారించడంలో దానిమ్మ రసం ఎంతగానో సహాయపడతుంది.

దానిమ్మ రసం మీ గుండెకు ఎంతో మేలు చేస్తుంది: దానిమ్మ రసం కానీ, గింజలు కానీ మీ గుండెకు ఎంతో మేలు చేస్తుందని..దీని ద్వారా రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తొలగించడం ద్వారా.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో మరియు ధమనులు గట్టిపడకుండా చేస్తుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ధమనులలో కొలెస్ట్రాల్ అభివృద్ధిని నిరోధించడంలో కూడా సహాయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు రసం కాకుండా.. గింజలు తీసుకుంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

 దానిమ్మ రసం ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది: ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ ఉన్నాయి, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలున్నాయి. శరీరంలో అనారోగ్య సమస్యలను దూరంగా ఉండంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. దానిమ్మలో యాంటీవైరల్ లక్షణాలు ఉన్న కారణంగా, సాధారణ ఇన్‌ఫెక్షన్‌లకు కూడా దూరం చేస్తుంది.

దానిమ్మ రసం జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది: రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే ఎంతో ఫ్రెష్ గా ఉంటారు.ఈ రసంలో ఉండే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థకు చాలా సహాయపడుతుంది. మలబద్దకం, అజీర్ణ సమస్య ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ రసాన్ని తీసుకుంటే ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ శరీంలో ఉండే రుగ్మతలకు దూరంగా ఉండొచ్చు.

కిడ్నీ సమస్యలున్నవారు దానిమ్మ రసం తీసుకోవచ్చు: కిడ్నీ సమస్యలున్నవారు దానిమ్మ రసాన్ని తీసుకోవచ్చునని ఈజిప్టుకు చెందిన పెల్వాన్ యూనివర్శిటీ ఫ్యాక్టల్టీ ఆఫ్ సైన్స్ జువాలజీ విభాగం, మరియు సౌదీ అరేబియాలోని కింగ్ సౌద్ యూనీవర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ జువాలజీ విభాగం సైంటిస్టులు ఎలుకలపై పరిశోధన చేసిన తరువాత కొత్త విషయాన్ని కనిపెట్టారు. దానిమ్మ పొట్టుకానీ, రసంకానీ త్రాగితే కిడ్నీలో ఉండే స్టోన్స్ కూడా కరుగుతాయట.

దానిమ్మ రసం చర్మసౌందర్యం: దానిమ్మ రసం త్రాగడం వల్ల మీ ముఖంలో తేజస్సు ఉంటుంది. మీ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తొలిగిపోతుంది. చర్మంపై ఉండే మచ్చలు, దద్దర్లు కూడా తగ్గుతాయని సర్వేలలో తేలింది. సాధారణంగా ఈ రసాన్ని ఎక్సైజ్ అయిన తరువాతే త్రాగితే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయని న్యూట్రినిష్టులు చెబుతున్నారు.

మహిళలకు దానిమ్మ రసం మంచిది: దానిమ్మ రసం తీసుకోవడం వల్ల మహిళల్లో ఉండే రుగ్మతలు, గైనిక్ ప్రాబ్లమ్స్ తో పాటుగా రక్తహీనత తగ్గుతుందట. వాళ్లకు ఎనర్జీలెవల్స్ పెరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *