బ్రేక్ టైమ్ లో భీమ్లా నాయక్.. పవర్ స్టార్ ఇలా

బ్రేక్ టైమ్ లో భీమ్లా నాయక్.. పవర్ స్టార్ ఇలా

బ్రేక్ టైమ్ లో భీమ్లా నాయక్.. పవర్ స్టార్ ఇలా

అటు రాజకీయాలు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్.. ఖాళీ సమయంలో ఇలా ప్రేక్షకులను అలరించేందుకు షూట్ చేస్తున్నట్లు ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ ‘భీమ్లానాయక్‌’లో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ సాగర్‌ కె.చంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోలు పవన్‌కల్యాణ్‌, రానా షూట్‌లో పాల్గొంటున్నారు. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో చిన్న విరామం దొరకడంతో బ్లాక్ కార్ దగ్గర పవన్‌ గన్‌ చేతపట్టి టార్గెట్‌ని మిస్ కాకుండా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఆయన ఎంజాయ్ చేశారు.అయితే దీనికి సంబంధించిన వీడియోని చిత్ర బృందం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో ‘భీమ్లా నాయక్‌ ఇన్‌ బ్రేక్‌ టైమ్‌’ అని పేర్కొంది. ఈ వీడియోను చూసి  ప్రేక్షుకులు, అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

అయితే మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ ను తీయబోతున్నారు. మలయాళం సినిమాలో బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవర్ స్టార్..పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలో దగ్గుబాటి రానా పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్‌, నిత్యామేనన్‌ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై.. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పవర్ స్టార్ హిట్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: