BHELలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

BHELలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BHEL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు BHEL సైట్‌లలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలను కంపెనీ కాంట్రాక్ట్‌ పద్దతిన తీసుకుంటారు.

BHELలో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు దరఖాస్తులు కోరుతున్నది. అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

BHELలో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ విభాగంలో మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇంజనీర్‌ (CIVIL): 07, సూపర్‌ వైజర్‌ (CIVIL) – 15

ఇంజనీర్‌ విభాగంలో అప్లై చేసుకునేవారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో BE/BTech/ సంబంధిత 5 ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్ డ్యూయల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

సూపర్‌ వైజర్‌ (CIVIL) పోస్టులకు అప్లై చేసుకునే వారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఫుల్‌ టైం డిప్లొమా ఉత్తీర్ణత సాధించి.. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

సివిల్‌ ఇంజనీర్ విభాగంలో పోస్టుకు సెలక్టైన అభ్యర్థికి నెలకు రూ. 71,040 శాలరీ ఉంటుంది. సూపర్ వైజర్‌ విభాగంలో సెలక్టైన అభ్యర్థికి నెలకు రూ. 39,670  శాలరీ ఉంటుంది.

అప్లై విధానం: ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే 04-09-2021 వరకు అప్లై చేసుకోవచ్చును.

లాస్ట్ డేట్ 24-09-2021 తో ముగింపు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్ సైట్ ని సంప్రదించండి. https://www.bhel.com/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: