గుజ‌రాత్ సీఎంగా భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణం

గుజ‌రాత్ సీఎంగా భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణం

గుజ‌రాత్ సీఎంగా భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం

గుజ‌రాత్ 17వ సీఎంగా భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వానికి కేంద్రమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చోహాన్, గోవా సీఎం, కేంద్రమంత్రులతో సహా పలువురు హాజరయ్యారు. గుజరాత్ సీఎంను మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.. విజయ్ రూపాణీ రాజీనామా చేయడంతో.. కొందరి పేర్లను అనుహ్యంగా తెరపైకి తెచ్చింది. దీనిలో భాగంగా నితిన్  పటేల్, వ్యవసాయశాఖ మంత్రితో పాటు పలువురి కేంద్రమంత్రులు వినిపించాయి. అయితే పటేల్ సామాజిక వర్గానికే అధిష్టానం మొగ్గుచూపింది. భూపేంద్ర పటేల్ ను సీఎంగా చేయాలని నిర్ణయించింది.

అయితే వీరంద‌ర్ని కాద‌ని మొద‌టిసారి ఘ‌ట్లోడియా నియోజ‌క వ‌ర్గం నుంచి అత్య‌ధిక మెజారిటితో విజ‌యం సాధించిన భూపేంద్ర ప‌టేల్‌కు అవ‌కాశం ఇవ్వ‌డం అంద‌ర్ని షాక్‌కు గురిచేసింది. దీనికి అంద‌రూ ఏక‌ప‌క్షంగా ఆమోదం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *