బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రోమో రిలీజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రోమో రిలీజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రోమో రిలీజ్

బుల్లి తెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అండోయి.. బిగ్ బాస్-5 ప్రొమో వచ్చేసింది.. బిగ్ బాస్ సీజన్ 5 అంటూ నాగార్జున ఓ ప్రోమోను విడుదల చేశారు. అయితే ఓ ప్రోమో సాంగ్ లో నిద్రమత్తు పోయేదెప్పుడో.. హుషార్ పుట్టేదెప్పుడో అంటూ పాట కొంతమంది కళాకారుల ద్వారా పాట కొనసాగుతుంది. దీనిని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.

ఇప్పటి వరకు బుల్లితెరపై రియాల్టీ షో లను పెద్ద పెద్ద స్టార్ లతో 4 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకుంది బిగ్ బాస్.. 5వ సీజన్‌లోకి అడుగుపెడుతోన్న షో ‘బిగ్‌బాస్’.

ఈ ఐదో సీజన్ ఎప్పుడా.. ఎప్పుడా అని బుల్లి తెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారు? అనే విషయాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొందరైతే హౌస్‌లోకి వెళ్లబోయే వారి లిస్ట్‌ను కూడా రెడీ చేసేశారు. బుల్లి తెర ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించుతూ బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ప్రోమోను విడుదల చేసింది స్టార్‌ మా. మొట్టమొదటిసారి ఓ మ్యూజిక్‌ వీడియో రూపంలో పూర్తి చమత్కారంగా ఈ ప్రోమోని తీర్చిదిద్దారు.

ఈ ప్రోమోలో కింగ్ నాగార్జునే హోస్ట్ అనేలా ఫుల్ క్లారిటీ ఇస్తూ.. ప్రోమోలో నటించిన వారిపై హాస్యంగా బుల్లెట్‌ల వర్షం కురిపిస్తూ గన్‌తో ‘విసుగు’ను చంపే సరసపు కిల్లర్‌గా ఈ ప్రోమోలో కింగ్ నాగార్జునని  చూపించారు.

గతంలో కంటే విభిన్నంగా చిత్రీకరించేందుకు `మా` ప్రయత్నిస్తోంది. కాగా, బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రోమోకు ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్, ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా   జె.యువరాజ్‌ ఈ ప్రోమో చేశారు. ఈ ప్రోమోకు మ్యూజిక్ యశ్వంత్‌ నాగ్‌ అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాటను ఆలపించారు. నాగ్ తో బిగ్‌బాస్ 5’ అంటూ ప్రోమోలో చెప్పిన విధంగా నాగ్  డైలాగ్ ప్రకారం.. అతి త్వరలోనే సీజన్-5కి మొదలుకానుందనేది ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చూపించిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *