తిరిగి రాని లోకాలకు … బిపిన్ రావత్

తిరిగి రాని లోకాలకు … బిపిన్ రావత్

ఎప్పుడూ భరత మాత సేవలోనే…
నిత్యం దేశాన్ని కాపాడాలన్న ఆలోచనే…
40యేళ్ళకు పైగా దేశ సేవకు పునరంకితం

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్… గా బాధ్యతలు నిర్వహిస్తూ మరణించారు బిపిన్ రావత్. నిజంగా ఇవాళ దుర్దినం… దేశం కోసం చివరి క్షణం కోసం పోరాడుతూ చనిపోయిన అలాంటి దేశ భక్తుడిని కోల్పోయిన మనం ఎంత దురదృష్టవంతులమో. సైన్యం నుంచి రిటైర్డ్ అయ్యాక కూడా … CDS గా కొనసాగుతూ దేశ సేవకు పునరంకితమయ్యారు బిపిన్ రావత్. 1978లో మొదటిసారిగా గూర్ఖా రైఫిల్స్ లో కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకూ తన సేవలను కొనసాగించారు. తమిళనాడులోని కానూర్ దగ్గర జరిగిన హెలికాప్టర్ లో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులికా రావత్ కూడా చనిపోయారు.

రావత్ కు ఉగ్రవాద, వేర్పాటు వాద నిరోధక ఆపరేషన్లలో కీలకంగా పాల్గొన్నారు. జమ్ము కశ్మర్ లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. 2015లో బిపిన్ రావత్ ఆధ్వర్యంలో మయన్మార్ లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఎవరూ మర్చిపోలేనిది. ఆయన ధింపూర్ లో టైగర్ కోర్ బాధ్యతలు నిర్వహిస్తున్న టైమ్ లో మయన్మార్ లో ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. 18మంది భారత జవాన్లను UNLFW మిలిటెంట్లు హత్య చేసి… భారత్ బోర్డర్ దాటి మయన్మార్ కు పారిపోయారు. అప్పుడే భారత్ సైన్యం సరిహద్దులు దాటి మయన్మార్ లోకి వెళ్ళి మిలిటెంట్లను చంపేసింది.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టాక ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్రివిధ బలగాలను సమన్వయం చేస్తున్నారు. చైనా లద్దాఖ్ ను ఆక్రమించిన టైమ్ లో త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా పనిచేశారు. త్రివిధ దళాలు చైనాను గట్టిగా ఎదుర్కోవడంలో బిపిన్ దే కీలకపాత్ర.

ఏదేమైనా భరతమాత ఇవాళ ఓ ముద్దు బిడ్డను కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *