అసెంబ్లీలో ఇక బీజేపీ RRR !

రాష్ట్ర అసెంబ్లీలో ఒక్కో సభ్యుడి బలం పెంచుకుంటోంది బీజేపీ. 2018 లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒకే ఒక్క సభ్యుడు రాజా సింగ్ గోషా మహల్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు విజయం సాధించారు. ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఈటెల రాజేందర్ గెలిచారు. దాంతో ఇకపై అసెంబ్లీలో RRR లు తమ గళం వినిపించనున్నాయి

R – RAJA SINGH

R – RAGHU NANDAN

R – RAJENDAR EETALA

హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ మళ్ళీ గెలవడం రాష్ట్ర బీజేపీలో ఉత్సాహం నింపింది. ఈ ఎన్నికలో గెలుపుతో ఇక తమ పార్టీకి తిరుగులేదని .. KCR ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టే టైమ్ దగ్గర పడిందని స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2022-23 అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *