బ్లాక్ బస్టర్ రికార్డులో “సర్కారువారి పాట”

బ్లాక్ బస్టర్ రికార్డులో “సర్కారువారి పాట”

బ్లాక్ బస్టర్ రికార్డులో సర్కారువారి పాట

సూపర్‌స్టార్ పుట్టిన రోజు నాడు విడుదలైన ‘సర్కారువారి పాట’ బ్లాస్ట‌ర్ పేరుతో ఓ చిన్న ప్రోమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. అయితే మ‌మేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’  షూటింగ్‌ను హైదరాబాద్‌లో జ‌రుపుకుంటున్నామని చిత్రయూనిట్ తెలిపింది. అందులో మ‌హేశ్ లుక్‌, చిన్న యాక్ష‌న్ సీన్స్ అన్ని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఇక మహేష్ ఫ్యాన్స్,ప్రేక్షకులు  ఊరుకుంటారా!.. ఈ చిత్రంలో మహేష్ లుక్ ఏ విధంగా ఉండబోతుందని ఫ్యాన్స్ లో ఓ ఉత్కంట నెలకొంది. సో.. దాంతో ఈ ప్రోమోను ఓ రేంజ్‌లో నెటిజెన్లు, అభిమానులు, ఫ్యాన్స్ వీక్షించారు. దీంతో ‘సర్కారువారి పాట’ బ్లాస్ట‌ర్ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది.ప్రోమో విడుద‌లైన 24 గంట‌ల్లో ఈ బ్లాస్ట‌ర్ ప్రోమోకు 25.7 మిలియ‌న్ వ్యూస్‌, 7ల‌క్ష‌ల 54వేల లైక్స్ దేశ, విదేశాల నుంచి వ‌చ్చాయి.

తెలుగు సినిమాల్లో ఒక్క రోజులో ఎక్కువ మంది చూసిన వీడియోగా మ‌హేశ్ ఓ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. మ‌రీ ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి మ‌రి.

ఈ చిత్రానికి ప‌ర‌శురాం డైరెక్టర్ గా మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై  న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ తో కలిసి కీర్తిసురేశ్ నటిస్తోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న సినిమా విడుద‌ల‌వుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *