ఇమ్యూనిటీ పెంచుకోండి … మీ రోజుని ఇలా మార్చుకోండి

ఇమ్యూనిటీ పెంచుకోండి … మీ రోజుని ఇలా మార్చుకోండి

ఎన్నో కొత్త వేరియంట్స్ వస్తున్నాయి. కానీ మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకుంటే దేన్నయినా తరిమేయొచ్చు. మనలో ఉండే రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి ప్రతి రోజూ ఇలా చేయండి

ప్రతి రోజూ 2 1/2 లీటర్ల నీళ్ళు తాగాలి 

జీవక్రియలు అన్నింటికీ నీళ్ళే ఆధారం. దాహం వేసే వరకూ వెయిట్ చేయకుండా నీళ్ళు తాగుతుండాలి. ప్రతి రోజూ కనీసం రెండున్నర లీటర్ల నీళ్ళయినా తాగుతుండాలి.

అన్ని కూరగాయలూ తినాలి

చాలామంది నాకు ఇది ఇష్టం ఉండదు… అది ఇష్టం ఉండదు… అంటూ చాలా రకాల కూరగాయలను తిరస్కరిస్తుంటారు. ఎక్కువగా ఫ్రైలకు అలవాటు ఒకటి రెండు కూరగాయలు లేదంటే దుంపలకే పరిమితం అవుతారు. అలాంటప్పుడు మీ శరీరంలోకి విటమిన్లు, ఇతర పోషక పదార్థాలు ఎలా చేరతాయి. అందుకే ఒంటికి కావాల్సిన అన్ని పోషకాలు అందాలంటే… విటమిన్లు, ఖనిజాలు, ఇతర పదార్థాలు అన్నీ తినాల్సిందే. రోజుకు 400 గ్రామాలు పండ్లు, కూరగాయలు తినాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. సీజనల్ ఫ్రూట్స్ కి కూడా ప్రియారిటీ ఇవ్వండి.

రోజూ ఒకేసమయానికి భోజనం

ఎప్పుడు పడితే అప్పుడు తినడం కాదు… అల్పాహారం, భోజనం లాంటి ఎన్ని పనులు ఉన్నా… టైమ్ కి తినడం అలవాటు చేసుకోవాలి… ఎప్పుడైనా పని ఒత్తిడితో స్కిప్ చేసినా టైమ్ సెన్స్ మాత్రం తప్పనిసరి. శరీరం, మెదడు సక్రమంగా పనిచేయాలంటే శక్తిని ఇచ్చేది ఆహారమే కదా… అందుకే రోజూ ఒకే టైమ్ కి తినడం అలవాటు చేసుకుంటే జీవగడియారాన్ని పనిచేయించే జన్యువులు నియంత్రణలో ఉంటాయని గుర్తుంచుకోండి

కంటి నిండా నిద్ర పోవాలి

రోజుకు 6 నుంచి 7 గంటల నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. నిద్రలోనే మన శరీరం మరమ్మత్తులు చేసుకుంటుందని అంటారు. నిద్రలేమి వల్ల నిస్సత్తువ, నీరసం వస్తాయి. రోజూ తగినంత నిద్రపోతే అన్నీ సర్దుకుంటాయని గ్రహించండి

రోజూ అరగంట వ్యాయామం

చాలామంది యోగా లేదు వ్యాయామం చేయాలంటే చాలు… అస్సలు టైమ్ సరిపోవడం లేదంటారు. స్నేహితులు సలహా ఇచ్చినా నాకు టైమ్ లేదని అంటుంటారు. కానీ రోజుకి ఎన్నో గంటలు టైమ్ వేస్ట్ చేస్తుంటాం. ఒక్క అరగంట మీకోసం మీరు కేటాయించుకోండి. యోగాకు రోజుకి 1800 సెకన్లు టైమ్ కేటాయిస్తే… ఇంక మీ ఆరోగ్యం గురించి వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు.

ఒత్తిడిని జయించండి

మానసిక ఒత్తిడే సగం ఆరోగ్యాన్ని తినేస్తుంది… అందుకే ఒత్తిడిని తగ్గించుకునే మార్గం చూసుకోండి. ఈ ఒత్తిడి వల్ల బీపీ, షుగర్, గుండె నొప్పి లాంటివి ఎటాక్ చేస్తుంటాయి. మనం రోజంగా ఎంత టెన్షన్ వాతావరణంలో పనిచేస్తున్నా… మానసిక ప్రశాంతంత కోసం ప్రతి రోజూ యోగా, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. అర గంట నుంచి గంట వరకూ మీకోసం మీరు టైమ్ కేటాయిస్తే చాలు. ఎంతో ఆరోగ్యాన్ని పొందుతారు.

నడక మంచిదే

ప్రతి రోజూ అరగంట నుంచి 40 నిమిషాలు నడవడం చాలా ఉత్తమం. అలాగే పని మధ్యలో … ఆఫీసులో కూడా ప్రతి గంటకు ఒకసారి కాస్తంత దూరం నడుస్తుండాలి… మీ కుర్చీ నుంచి లేవడం … కంప్యూటర్ స్క్రీన్ కి దూరంగా ఐదు, పది నిమిషాలు గడపడం చాలా ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *