బల్గేరియాలో బస్సు ప్రమాదం.. 45మంది మృతి

పశ్చిమ బల్గేరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై నార్త్ మెసిడోనియన్ వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 45 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. ఈ బాధితుల్లో పెద్దలతో పాటుగా ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని, వారిని కాలిన గాయాలతో ఏడుగురిని రాజధాని సోఫియాలోని ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక భద్రతా విభాగానికి చెందిన ఇంటర్నల్ హెడ్ మినిస్టరీ నికోలాయ్ నికోలోవ్ వెల్లడించారు.

అయితే బస్సు ప్రమాదం అనేది బస్సు బోల్తాపడటంతో అగ్నిప్రమాదం జరిగిందా లేక అగ్నిప్రమాదం జరిగాక బొల్తాపడిందనేది ఇంకా స్పష్టత రాలేదని నికోలోవ్‌ చెప్పారు. అయితే ఈ ప్రమాదం తెల్లవారుఝామున సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చని అంటున్నారు. పైగా బాధితుల్లో ఎక్కువ మంది నార్త్ మాసిడోనియాకు చెందిన వారేనని సోఫియాలోని నార్త్ మెసిడోనియా రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. భాదితులకు మెరుగైన వైద్యసాయం అందిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *