పిల్లి శకునం మంచిదేనా..?

పిల్లి శకునం మంచిదేనా..?

మూఢ నమ్మకాలను పాటించడంలో వివిధ దేశాలు ఒక్కో పద్దతి ఫాలో అవుతుంటాయి. అయితే ఇండియా సంస్కృతిలో మూఢ నమ్మకాలకు బాగా విశిష్టత ఉందని చెప్పొచ్చు. ఇండియాలో ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని “మూఢ నమ్మకాలు” అంటారు. ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి.

ఈ మూఢ నమ్మకం మనిషిని మనిషి లాగా ఉండనివ్వదు.. కాగా మనిషిని మూర్ఖంగా మారుస్తుంది ఈ మూఢ నమ్మకం. అయితే ఒత్తిడి కారణంగా మనలో మూఢ నమ్మకాలు  ప్రబలుతాయని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ రుగ్మత వల్ల ఆచార వ్యవహారాలపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా అవాస్తవమైన అంశాలు కూడా నిజంగానే ఉన్నట్లుగానే భ్రమపడతారని పరిశోధకులు తెలిపారు. బ్రిటన్‌లోని నార్త్‌ వెస్ట్రన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ గాలిన్స్కీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు సాగించారు.

అయితే లైఫ్ మీద అదుపు లేనట్లు భావిస్తే.. వారు ప్రపంచంపైన కొన్ని అభిప్రాయాల్ని మానవవాళిపై  రుద్దుతారని ఈ బృందం తేల్చింది. చదువుకున్న వారిలో కూడా మూఢనమ్మకాలు వుండడానికి చిన్న తనంలో పెద్దలు చెప్పిందే వేదంలో పిల్లలు భావించడం, శాస్త్రీయపద్ధతి అంతగా ప్రబలకపోవడం, ఆదర్శవ్యక్తులుగా ఉండవలసిన శాస్త్రవేత్తలు కొంతమంది అతేంద్రియ శక్తులు కనబరచే బాబాలకు శిష్యులవడం కొన్ని కారణాలు. ఇండియాలో ఇటువంటికి ప్రాముఖ్యతనిస్తారని చెప్పొచ్చు.

ఈ మూడ నమ్మకాలలో భాగంగా శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి ఎదురొస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం.. ఆరోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం.. ఈరోజు కలిసిరాదంటూ నమ్మకడం…కాలు కూడా ముందుకు వెయ్యకుండా వెనక్కి తిరుగుతారు. అయితే  నిజంగా.. పిల్లి మొహం చూస్తే అంత పంచ మహా  పాతకాలు చుట్టుకుంటాయా? అసలు ఏ సాంప్రదాయానైనా మన పూర్వీకులే కదా కనిపెట్టింది? మరి ఈ పిల్లి శకునం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా మరీ..

పూర్వం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చెయ్యాలి అంటే, ఎడ్ల బండి మీద, అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. వందలాది కిలోమీటర్లు ప్రయాణించే క్రమంలో చీకటి పడేది…అప్పుడు ఈ పిల్లుల జాతికి చెందిన సింహాలు, పులులూ వంటివి ఎదురు పడేవి. వాటిని చూసి పాపం ఎడ్లు భయపడి ఆగిపోయేవి. అందుకే ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడటం ద్వారా అప్పట్లో అపశకునంగా పెద్దలు భావించేవారు. కాలక్రమేణా ఈ అపశకునం అనే వారసత్వాన్ని పిల్లులు(CAT) కూడా పుచ్చుకోక తప్పలేదు.

అయితే ప్రస్తుత పరిస్థితులలో పిల్లి శకునాన్ని చాలా మంది నమ్ముతారు. మగపిల్లి, ఆడపిల్లి కలిసి దారికి అడ్డంగా వస్తే ఆరోజు చేపట్టే పనులు ఆగిపోతాయని, బాధలు కూడా కలుగుతాయని.. మరో సందర్భంలో ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తోంది. ఈ విచిత్రమైన విశ్వాసమేమిటంటే పిల్లి మూతిని నీళ్లలో కడుక్కుంటే ఇంటికి బంధువులోస్తారట..కుక్కలను చూసి పిల్లులు పారిపోతుంటే శత్రు భయం కలుగుతుందట. పిల్లి కక్కుతుంటే ఆరోగ్యం కలుగుతుందని..పిల్లి తన పిల్లలను నోట కరుచుకొని ఒక చోటి నుంచి ఇంకో చోటీకి తీసుకెళ్తుంటే.. మనకు స్థాన చలనం కలుగుతుందని..ఎలుకలను చూసి పిల్లి పారిపోతుంటే అపశకునాలు తొలిగిపోతాయని..పిల్లి తన పిల్లలను తీసుకొని వస్తుంటే అపశకునాలు ఏర్పడతాయని మన పూర్వీకుల నుంచి మూఢవిశ్వాసంగా భావించేవారు.

ఇతర దేశాలలో, పిల్లులని పెంపుడు జంతువులుగా  చేసుకుని పెంచుకునే వారు కోకొల్లలు. పిల్లులు కూడా ఇతర పెంపుడు జంతువుల వంటివే.. అదే ప్రకృతి వైపరిత్యాలను ముందే పసిగట్టి, మనిషిని కాపాడేందుకు, పిల్లి అరవడం, అనేది శుభ సూచకంగా భావించొచ్చు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *