సంపూ క్యాలీఫ్లవర్ టీజర్..శీలోరక్షతి రక్షితః

సంపూ క్యాలీఫ్లవర్ టీజర్..శీలోరక్షతి రక్షితః

తెలుగు ఇండస్ట్రీలో సంపూర్ణేష్ బాబు అంటే ఓ స్పెషల్.. విభిన్నమైన పాత్రలలో కొత్త కథనాలతో చిత్రాలన్ని తెరకెక్కించడంలో సంపూకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ సినిమాలో ‘‘ఓ మహిళ వల్ల శీలం పోగొట్టుకున్న ఒక మగాడు న్యాయం కోసం చేసే పోరాటమే ‘క్యాలీ ఫ్లవర్‌’ కథ’’ అని సంపూర్ణేష్‌ బాబు అన్నారు.

ఆర్కే మలినేని దర్శకత్వంలో సంపూర్ణేష్, వాసంతి జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్యాలీ ఫ్లవర్‌’. మధుసూదన క్రియేషన్స్ అండ్ గూడూరు శ్రీధర్‌ బ్యానర్ పై ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. తాజాగా క్యాలీఫ్లవర్ సినిమా మూవీ టీజర్ విడుదలైంది.

‘‘ప్రేక్షకుల్ని నవ్వించేందుకు సంపూర్ణేష్ బాబులోని నటుణ్ణి బయటకు తీసుకొచ్చారు ఆర్కే మలినేని. ఈ సినిమా హిట్‌ అయితే దానికి కారణం ప్రేక్షకులు.. తేడా కొట్టిందంటే నా వల్లే’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. ఈ చిత్రంలో శీలం ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు శీలం గొప్పదన్న పాత్ర ఉంటుందనే కాన్సెప్టుతో ఈ మూవీని తీశారు. ముఖ్యంగా మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో పోరాటం చేసే వ్యక్తి పాత్రలో సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్లో నటించాడు.

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: