డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం నేరం కాదు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం నేరం కాదంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలో దీనిపై చట్టం చేస్తామని లోక్ సభలో తెలిపారు. అయితే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడేవారు కొన్ని నిబంధనలు పాటించాలన్నారు. మొబైల్ ఫోన్ ను బ్లూ టూత్, ఇయర్ ఫోన్స్ ద్వారా మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడు నేరం కిందకి రాదన్నారు. ఫోన్ ని కారులో కాకుండా జేబులో పెట్టుకోవాలని మంత్రి సూచించారు. ఒక వేళ ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపి చలానా విధిస్తే కోర్టులో సవాల్ చేసుకోవచ్చని తెలిపారు మంత్రి నితిన్ గడ్కరీ.
[ays_poll id=5]