ఏ ఛాయ్ తాగితే ఏం లాభం ?

ఏ ఛాయ్ తాగితే ఏం లాభం ?

పొద్దున్నే లేవగానే ఓ చుక్క పడందే ఫ్రెష్ కాలేం  రా.. బాబు అంటూ కొందరు.. బాబు తలనొప్పి రా బాబు అంటూ అని.. కొందరు.. 

కొంప తీసీ మీరు అదేదో అనుకుంటున్నారా..  అదేం కాదండి బాబు..

అదేనండి.. ఏయే ఛాయ్.. ఛటక్కున తాగారా భాయ్..ఈ ఛాయ్ చీప్ రా భాయ్ అంటూ.. ఎంతో మంది కవులు టీ పై గొప్పగా కవిత్వాలు రాశారు. అసలు “టీ”  కథ ఏంటో ఓ లుకేద్దామా మరీ..

 (Tea)ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు (టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో  ఉంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు.“టీ” కొక దినోత్వాన్ని కూడా కేటాయించారండోయ్ …ప్రతి ఏడాది డిసెంబరు 15అంతర్జాతీయ “టీ”దినోత్సవంగా నిర్వహించబడుతుంది.

  “టీ” నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో “టీ” యొక్క పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నావారికీ “టీ”  త్రాగితే అత్యంత ఉల్లాసాన్ని అందిస్తుంది. ఈ “టీ” జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా “టీ “ని సేవిస్తున్నారు. కాస్త వర్షం చినుకులు పడగానే గుర్తోచ్చేది.. ఒక కప్పు పొగలు కక్కే “టీ” యే నండి. ఇంటిపని, ఆఫీస్ పనుల్లో తలమునకలై అలిసిపోయిన ప్రియులకు “టీ” ఒక వరం. ఆ టీని చూడగానే ఒత్తిడి అంతా మాయమైపోతుంది. కానీ మార్కెట్లో వివిధ రకాల టీ పౌడర్లు అందుబాటులోకి వచ్చాయి. టీ తాగే ప్రియులకు ఇదో వరంగా చెప్పొచ్చు.

“టీ” సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ,  ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన, శక్తిదాయకమైన పానీయం. దీనిలో విటమిన్లు ముఖ్యంగా బీ గ్రూప్ విటమిన్లు, రిబోఫ్లేవిన్, నియాసిన్ ఉంటాయి. దీనిలో అతి తక్కువగా లభించే ” కెఫీన్” మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అపాయకారి కాదు. వయసుతో నిమిత్తం లేకుండా “టీ” ని సేవించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది.

ఒకప్పుడు అతిథులకు మర్యాదపూర్వకంగా “టీ” ని ఇచ్చే వారు.. కానీ నేటి తరంలో ఈ “టీ” నీ త్రాగే నీరులాగా అతి సాధారణ పానీయం అయింది. ఎక్కడబడితే అక్కడ “టీ” దుకాణాలు వెలవడం.. జనం ఈ పానీయానికి ఎంతగా అలవాటుపడ్డారో చెప్పకనే చెబుతుంది. తేనీరువల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాక అలాంటి వారి ఆలోచన మారకపోవచ్చు. రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.

 టీ ఎన్ని రకాలు:

ఇరానీ ఛాయ్: ( హైదరాబాద్)

హైదరాబాద్‌ వచ్చిన ప్రతి ఒక్కడు  “ఇరానీ ఛాయ్‌ ” తాగి చూడాల్సిందే..ఎందుకంటే ఈ “టీ ” అంత పాపులారిటీని సంపాదించుకుంది. ఈ ఇరానీ ఛాయ్ (Irani Chai ) అనే పేరు రావడం వెనుక పెద్ద కథే ఉంది అని చెప్పాలి. వందల ఏళ్ల కిందట మనదేశానికి ఇరానీయన్లు వలస వచ్చారు.. వారు ఆ టీని తాగేవారు…  క్రమంగా ఈ ఛాయ్ ని అందరికీ అలవాటు చేశారట. 

ఈ ఛాయ్ ని పుణే, హైదరాబాద్ ల్లో ఈ ఇరానీ టీ ని తాగుతున్నారు . ఇరానీ స్టైల్ ఛాయ్ ని ఇక్కడి వారికి అలవాటు చేసి క్రమక్రమంగా అదే వృత్తిగా చేపట్టి ఇరానీ కేఫ్‌లకి తెరతీశారు. ఇదే ఆ తరువాతి కాలంలో ఇరానీ ఛాయ్‌గా పాపులర్ అయింది.

ఈ ఇరానీ ఛాయ్‌కి హైదరాబాద్‌ (Hyderabad ) లో ఉన్న ఫాలోయింగ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. వేరే ప్రాంతం, రాష్ట్రం లేదా విదేశాల నుండి వచ్చే వారు తప్పక ఇరానీ “టీ” రుచి చూడాల్సిందే.. ఉదాహరణకి.. ఇరానీ ఛాయ్‌లోకి ఎవరైనా ఎక్కువగా ఇష్టపడేది ఉస్మానియా బిస్కట్స్ నండోయ్… 

ఈ సారి హైదరాబాద్ వచ్చిన వారు తప్పకుండా ఈ ఛాయ్ రుచి చూస్తారుగా మరీ….   

గ్రీన్ టీ:  జపాన్ లో  వేడి నీటి ఆవిరిలో తేయాకులను ఉంచుతారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే దీన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య ప్రధాయనిగా పిలుస్తారు. తేయాకులకు కొన్ని పరిమళాలు జోడించి తయారు చేస్తారు. ఈ గ్రీన్ టీ అనేది రుచిగా ఉంది.

బ్లాక్ టీ: బ్లాక్‌ ” టీ ” తాగేవారిని ” ఫ్లూ” జ్వరాలు లాంటివి దరిచేరవని నిపుణులంటున్నారు. బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు. టీ డీహైడ్రేషన్ సమస్యనూ దూరం చేస్తుందని నిపుణుల అభిప్రాయం. రోజూ మూడు లేదా నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది. తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి. ఈ టీ క్యాన్సర్ రాకుండా చేస్తోందట… కాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది, సెర్వికల్ కాన్సర్ ప్రమాదము నుండి దూరం చేస్తుంది.

స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తోంది. అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కూడా రాకుండా కాపాడుతుంది. జీర్ణ నాళం లోని పలు భాగాలకు వచ్చే క్యాన్సర్లకు టీ విరుగుడుగా పనిచేస్తుంది. చెడ్డ కొలెస్టిరాల్ తో పాటు రక్తపోటు(BP)తో పాటు ట్యూమర్లతో పాడైన జీవకణాలను మరమ్మత్తు చేస్తుంది.

అల్లంటీ: టీ లో అల్లం వేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో పుష్కలంగా విటిమిన్ ” సి”, మెగ్నీషియం, మినరల్స్ లభిస్తాయి. ఈ టీ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తోంది. కడుపు ఉబ్బరంగా, గ్యాస్,  తేన్పులు, మహిళల పిరీయడ్స్ సమయంలో ఎదుర్కొనే వారందరికీ ఈ టీ ఎంతో దివ్య ఔషధంగా పనిచేస్తోంది. ముఖ్యంగా జలుబు, జ్వరం, 40 ఏళ్లు దాటినా వరంతా నడుము నొప్పి, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారికి ఈ టీ ఎంతో అధ్భుతంగా పనిచేస్తుంది.

యాలకుల టీ:  సుగంధ ద్రవ్యాల్లో యాలుకలు ఒకటి. యాలకుల గింజల పొడిని టీలో వేసి తాగితే చాలా మంచిది. ఆయుర్వేదంలో యాలుకులకు ఓ ప్రత్యేకత ఉంది. కిడ్నీలో రాళ్లు, ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, వీర్య కణాల వృద్ధికి ఎంతగానో దోహదపడుతోందని ఆయుర్వేదంలో చెబ్బబడింది. అందుకే ఈ సుగంధ (యాలుకలు) ద్రవ్యానికి రేటు బాగా ఉంటుంది. నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది. నీరసాన్ని పోగొట్టి ఆకలిని పెంపోదించడంలో యాలకుల ప్రత్యేక పాత్ర వహిస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వైట్ టీ: లేత టీ బడ్స్ (కొమ్మచివర్లో ఉండే భాగం) నుంచి తయారు చేస్తారు. ఇది ప్రాసెస్ చేయని తేయాకు. ఇతర రకాల టీతో పోలిస్తే దీని ధర చాలా ఎక్కువ. ఇతర దేశాల్లో ఈటీ కి బాగా ప్రాముఖ్యత ఉంది.

ఎల్లో టీ: ఈ ఎల్లోటీ గ్రీన్ టీ తరహాలోనే ప్రాసెసింగ్ జరుగుతుంది..దీని తయారీకీ ఎక్కువ టైం పడుతుంది. ఫ్లేవర్ వచ్చే వరకు టీ తయారు చేస్తారు. అందుకే ఈ టీకి డిమాండ్ ఎక్కువ. ఈ టీ కప్పు అక్షరాలా రూ.6,500. స్టార్ హోటళ్లో ఈ టీ లభిస్తుంది. అచ్చమైన తేయాకు ఎండబెట్టి టీ తయారు చేస్తారు.ఇది 24 కేరట్ల బంగారంతో మిలితం చేసిన ఫ్లేవరతో ఎల్లో బడ్ టీ పొడి తయారు చేస్తారట.

అస్సాం టీ:  ఒకేచోట అత్యధిక విస్తీరణంలో తేయాకు సాగువుతున్న రాష్ట్రం అస్సాం. దీనికి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది.ఇది ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉత్తర బ్రహ్మపుత్ర వ్యాలీ, కాబ్రి, కచ్చర్ హిల్స్, బరాక్ వ్యాలీ వ్యాప్తంగా టీ తోటలున్నాయి.

బాదం టీ: దీని వల్ల ఎముకలు, శృంగార ధారుడ్యంతో పాటు దగ్గు, జలుబు, ఆయాసం తగ్గుతుంది. దీనిలో వాడే పదార్ధాలు టీ పోడి, బాదం, పాలు, నిమ్మరసం, చక్కర, వీటిని తీసుకోవడం వల్ల తలనొప్పి, ఎనర్జీ వస్తుంది. 

దాల్చిన చెక్క టీ: చలికాలో  ఈ టీ తాగడం వల్ల శరీరంలోని మలినాలు, జలుబు, దగ్గు, వంటి సమస్యల నుంచి దూరం అవుతాయి. మందులకు వేలకొద్ది తగలేసే కంటే ఈ టీ చేసుకొని తాగితే రోగాల బారి నుండి మన శరీరాన్ని సంరక్షించుకోవచ్చు.

జింజర్‌ టీ, గ్రీన్, బ్లాక్, దాల్చిన చెక్క, వైట్‌ టీ, ఎల్లో టీ, బాదం టీ, మింట్, మిరియాలు, వాము, గార్లిక్‌.. ఇలా రకరకాల టీలు  మార్కెట్ లో లభ్యమవుతున్నాయి.  ఏదీ ఏమైనా టీ ఎన్ని రకాలుగా తాగిన టీ ప్రియులకు ఇంకా కొత్తదనం కావాలనే ఉంటుంది. సో.. టీ తాగడం మానేయకండి గురూ… ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *