చైతూ-సమంత విడాకులు..!

వీడిన మూడుముళ్ల బంధం.. చైతూ-సమంత 

తెలుగు ఇండస్ట్రీలో అధ్బుతమైన సినిమాలు తీసి చైతూ, సమంత మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలు టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చాయి. ఆ సినిమాలు మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా ఉన్న సమంత (Samantha), నాగచైతన్యలు (Naga Chaitanya) విడిపోతున్నారు అనే విషయంపై సోషల్ మీడియా వేదికగా పుకార్లు పుట్టిన విషయాన్ని వాళ్లు నిజంగానే రుజువు చేశారు. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇలా తమ 10ఏళ్ల ప్రేమ బంధానికి చైతూ, సామ్‌లు ముగింపు పలికారు. చాలా కాలం నుంచి ఈ విషయం గురించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చామని ఆ ప్రేమ జంట చెప్పింది. ఇకపై మేమిద్దరం భార్య భర్తలుగా విడిపోతున్నాము. ఈ 10ఏళ్ల  కాలంలో మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అలానే కొనసాగుతుందని అనుకుంటున్నామని సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. ఈ సమయంలో మా భావాలను అభిమానులు అర్ధం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని కోరుకుంటున్నాము. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు మాకు ఉండాలి అంటూ సమంత, చైతన్యలు వేర్వేరుగా పోస్టులు చేశారు.

అయితే చైతన్య, సమంత విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతుంది. ముఖ్యంగా వారు ఎందుకు విడిపోయారు..?, విడిపోవడానికి కారణలేమిటి..? అనే అంశంపై నెటిజన్లు తమకు తోచిన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పెళ్లి తరువాత కూడా సమంత సినిమాలు, వాణిజ్య ప్రకటనలో అసభ్యకర ఫోజులు తీయడంపై వారివురి మధ్య గొడవలకు దారి తీసిందనే అంటున్నారు. ఇది చైతూకు ఇష్టంలేని లేదని తెలుస్తోంది. కరోనా టైంలో వారివురు కలిసి ఉన్నా.. వివాద చర్చలకు దారి తీసిందని తెలుస్తోంది. అయితే ఇంట్లో పెద్దలు అంగీకారంతోనే వారి జీవితానికి పుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు.

సోషల్ మీడియా వేదిక ద్వారా మరోవైపు విడాకులు ద్వారా సమంత.. అక్కినేని చైతన్య నుంచి ఎంత భరణం పొందుతుందనే చర్చ కొనసాగిస్తున్నారు. విడాకుల ద్వారా అక్కినేని స్థిర, చర ఆస్తులను చూస్తుంటే సమంతకు భరణం కింద రూ.350 కోట్ల నుంచి రూ. 250 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెగ వైరల్ అవుతోంది. అభిమానుల్లో కొందరూ మాత్రం రూ.50 కోట్లని ప్రచారం చేస్తున్నారు.

ఇటీవలే హిందూస్తాన్ టైమ్స్ (Hindustantimes)లో సమంతపై ఓ ఆర్టికల్ వచ్చింది. అయితే సమంత.. అక్కినేని చైతూ నుంచి భరణం తీసుకోవడానికి నిరాకరించిందని కథనాన్ని ప్రచురించింది. మూడుముళ్ల బంధం తెగిపోవాలంటే.. సెటిల్‌మెంట్‌లో భాగంగా అక్కినేని చైతన్య నుంచి.. సమంతకు రూ.200 కోట్లు ఆఫర్ చేశారని ప్రచారం కొనసాగింది. కానీ సమంత ఒక్క పైసా కూడా తీసుకోలేదు. వివాహం అనే బంధానికి ముగింపు పలకాల్సి రావడంతో సమంత కలత చెందిందని, చైతూ నుంచి సమంత కేవలం ప్రేమను మాత్రమే కోరుకుందని తెలుస్తోంది. ఇప్పుడు ఆ బంధం ముగిసిపోవడం. సమంత మరేమీ ఆశించలేదు అని సంబంధిత వర్గాల ద్వారా తెలిపినట్టుగా ఆమె వెల్లడించింది. ఇక, చైతూ, సమంతలను కలిపేందుకు సినీ ఇండస్ట్రీలో సన్నిహితులు, పెద్దల ద్వారా ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేదు.. అయితే మేము వేర్వేరు కారణాల వల్ల విడిపోవాల్సి వస్తోందని తెలిపింది.

చైతన్య, సమంత విడాకులపై కింగ్ నాగార్జున ఏమన్నారంటే

చైతన్య, సమంత విడిపోవడం చాలా బాధాకరం. అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’అని నాగ్‌ ట్వీట్‌ చేశాడు.

కరోనా టైంలో ఇటీవల ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్-2లో సమంత పాత్రకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో పౌరాణిక చిత్రం శాకుంతలంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో సమంత నటించింది. టాలీవుడ్ డైరక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మహాభారతంలోని ఆదిపర్వం నుండి సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. పౌరాణిక నేపథ్యంలో..ఈ చిత్రంలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చాలా అందంగా తీర్చి దిద్దారు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. ఈ సినిమా సమంతకు మరోసారి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *