చిన్నారులలో మానసిక థైర్యం నింపడమెలా..?

చిన్నారులలో మానసిక థైర్యం నింపడమెలా..?

చిన్నారులలో మానసిక థైర్యం నింపడమెలా..?

జీవితం అనేది విచిత్రమైనది. ఎన్నో మలుపులు, ఒడిదొడుకుల మధ్య సాగుతుంటుంది. అయితే జీవన విధానంలో భాగంగా పెళ్లై పిల్లలు కనడం కూడా భాగమే. అయితే ఆ పిల్లల ఎదుగుదలకు మనం ఎన్నో ప్రయాసలు పడాల్సి వస్తుంది. అయితే తల్లి దండ్రులు వామ్మో మా పిల్లలు బాగా అల్లరి చేస్తారండి..ఇంకొకరైతే మా పిల్లలు కామ్ గా ఉంటారండి అని చెప్పుకుంటూ పోతే ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చే సమాధానాలు కోకొల్లలండీ..అయితే పిల్లల మానసిక ఎదుగుదలలో మనం గమనించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. పిల్లలకు మాత్రం మనమే ప్రపంచము. పిల్లలు అన్నీ మనకే చెప్పుకుంటారు.

పిల్లల్ని కనడం, పెంచి పెద్ద చెయ్యడం..సమాజం పట్ల వారికి అవగాహన కల్పించడం, చిన్నారుల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించడం ఇవన్నీ ఎంతో సున్నితమైన అంశాలు.. ఎంతో కష్టమైన విషయాలు కూడా. తల్లిదండ్రులకు, పెద్దలకు పిల్లలతో కాలం ఎంత సరదాగా గడుస్తుందో…ఒక్కోసారి అంత ఇబ్బందికరంగానూ ఉంటుంది. ఎంతో సహనంతో ఉంటే తప్ప పిల్లల అల్లరిని తట్టుకోలేరు తల్లిదండ్రులు. మనం కోపంలో చిన్న మాట అన్నా పిల్లలు భరించలేక లోలోపలే కుమిలిపోతుంటారు పిల్లలు. చిన్నారుల్లో శారీరక ఎదుగుదలతోపాటూ..మానసిక ఎదుగుదల కూడా అత్యంత ముఖ్యమే. ఈ రోజుల్లో తల్లిదండ్రులకీ ఒత్తిడి కామన్. పిల్లలు పెద్దవాళ్లయ్యాక… వాళ్ల జీవన విధానంలో మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. స్కూల్లో చదవాలనే ఒత్తిడి.. దీంతో వాళ్లకు టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ నుంచి ఎలా బయటపడేయాలనేవి నేర్పాలి. చదువులో ఎప్పుడైనా వెనకబడితే ధైర్యం చెప్పూతూ పోవాలి. పిల్లలు ఏదైనా పొరపాటు జరిగితే… ఏం కాదు డోంట్ వర్రీ అని సరైన పద్ధతిలో నడిపిస్తే… వారిలో ఆత్మ ధైర్యం పెరుగుతుంది.

అయితే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది చిన్నారుల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చిన్నారులు అదే పనిగా ఏడవడం, మౌనంగా ఉండిపోవడం, చురుకుదనం లేకపోవడం, భయపడటం, ఏమాత్రం అల్లరే చెయ్యకుండా ఉండిపోవడం ఇలాంటి ఎన్నో మానసిక సమస్యలకు గురువుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల్లో ఉండే అన్ని రకాల మానసిక రుగ్మతలను మనం నయం చేయలేకపోవచ్చు. కానీ వీలైనంతవరకూ ప్రయత్నించడం ద్వారా వారు కూడా మిగతా పిల్లల లాగా ఎదగగలరు. ఈ విషయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులూ ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ…వారికి అన్నీ తామే అయి పిల్లల్నీ ముందుకు నడిపించాలి.

డాక్టర్ల చెపుతున్న ప్రకారం.. పిల్లల్లో రకరకాల మానసిక సమస్యలకు అలవాట్లేనని ప్రధాన కారణమనీ..తల్లీదండ్రులు పిల్లలకు సరైన అలవాట్లు నేర్పడంతో పాటుగా..చిరుతిళ్లకు దూరంగా పెట్టండతో పాటుగా బలమైన ఆహారం తినేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుదేనని.. శారీరక శ్రమ, నడక, రన్నింగ్ చేసేలా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. దీనితో పాటుగా చిన్నారులు రోజుకు 8 గంటలు నిద్రపోయేలా చూడండి. సో.. సూచనలు పాటించి  చిన్నారులను పెంచడం ద్వారా చిన్నారుల మానసిక పరిపక్వతలో మార్పులనేవి వస్తాయి. ఇది మేం చెప్పిన మాటలు కావండి. నిపుణులు, అధ్యయనాలో వెల్లడి అయిన విషయాలను మీ ముందుంచాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *