చైనాలో మరోసారి లాక్ డౌన్.. కరోనా డెల్టా వేరియంట్ భయం..!

చైనాలో మరోసారి లాక్ డౌన్.. కరోనా డెల్టా వేరియంట్ భయం..!

చైనాలో మరోసారి లాక్ డౌన్.. కరోనా డెల్టా వేరియంట్ భయం..!

కరోనా వ్యాప్తికి కారణమైన  చైనాను మహమ్మారి మరోసారి వణికిస్తోంది. చైనాలో మరోసారి కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చైనాలోని అనేక ప్రాంతాల్లో, డెల్టా వేరియంట్‌కు చెందిన కరోనా వైరస్‌ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది. ఉత్తర చైనా ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో కరోనా కేసులు మళ్లీ పెరగడంతో అధికారులు లాక్‌డౌన్ విధించారు. నాలుగు మిలియన్ల ప్రజలు ఉన్న ఆ నగరంలో పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. నివాసితులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటిని విడిచి బయటకు రావద్దని అక్కడి అధికారులు ప్రజలను హెచ్చరించారు.

ప్రస్తుతం, ఏజిన్ కరోనా హాట్‌స్పాట్‌గా ఉంది. గత వారం ఇక్కడ 150 మందికి పైగా కొత్త సోకినవారిని కనుగొన్నారు. వీటిలో దాదాపు మూడోవంతు కేసులు ఈ ప్రాంతంలోని అలగ్జా లెఫ్ట్ బ్యానర్‌లోనే నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 1.8 లక్షల మంది నివసిస్తున్నారు.

చైనాలోని అనేక ప్రాంతాల్లో, డెల్టా వేరియంట్‌కు చెందిన కరోనా వైరస్‌ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది. తాజా కేసుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎజిన్ బ్యానర్‌లోని 35,700 మంది ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘించి బయటకు వస్తే సివిల్,  క్రిమినల్ కేసులు పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఎజిన్ బ్యానర్ ఆరోగ్య కమిషనర్ ‌సహా ఆరుగురిపై ప్రభుత్వం వేటేసింది. కాగా, దేశంలో 2 బిలియన్ కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు ఈ ఏడాది ఆగస్టులో చైనా ప్రభుత్వం ప్రకటించింది. చైనా రాజధాని బీజింగ్ లోను ఆంక్షలు తీవ్రతరం చేశారు.

వృద్ధ జంట కారణంగా పెరుగుతున్న కేసులు?

పలువురు టూరిస్టులతో కలిసి చైనాలో పర్యటిస్తున్న ఓ వృద్ధ జంటకు కరోనా సోకినట్లు గుర్తించలేకపోవడమే కేసులు పెరిగేందుకు కారణమని స్థానిక అధికారులు భావిస్తున్నారు. షాంఘై నుంచి వచ్చిన ఈ వృద్ధ దంపతులు గ్జియాన్, గన్సూ, బీజింగ్ సహా ఐదు ప్రావిన్సుల్లో పర్యటించినట్లు గుర్తించారు. వాయువ్య చైనాలో కొవిడ్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిసింది. వారు పర్యటించిన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. బీజింగ్ సహా పలు నగరాలకు వచ్చి వెళ్లాల్సిన వందాలది విమానాలను రద్దు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *