చైనాలో భారీ వర్షాలు

చైనాలో భారీ వర్షాలు

చైనాను ముంచెతుత్తున్న భారీ వర్షాలు

చైనాలో భారీ వర్షాలు, 30మంది మృతి

సహాయక చర్యల్లో సిబ్బంది

చైనాలో ఓ పక్క కరోనా, డెల్టా వెరియంట్ వైరస్ లతో అట్టుడికి పోతుంటే..చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రావిన్స్ హుబేలో ఐదు నగరాల్లో వరదలు ముంచెత్తాయి. అక్కడ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. చైనాలోని సుయిజ్ నగరంలో లియులిన్ టౌన్‌షిప్‌ వరదతో మునిగి పోయింది. వరదల కారణంగా తాజా లెక్కల ప్రకారం 30 మంది మరణించారు. 3 వేల ఇళ్లకు పైగా  ఇళ్లు, దుకాణాలు వరదనీటిలో మునిగాయి. అయితే వరదల ధాటికి రోడ్లు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ల వ్యవస్థలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 30మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 8,000 వేల మంది జనాభాను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు పయిచెంగ్ నగరంలో రికార్డు స్థాయిలో 400 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

హుబేలోని 774 రిజర్వాయర్లు వరదనీటితో నిండటంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. వరదల వల్ల 8,110 హెక్టార్లు పైగా పంటలు దెబ్బతిన్నాయని… యాంగ్జీ నది వెంట ఉన్న ప్రాంతాల్లో వరదనీరు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై సుజౌ, జియాంగ్యాంగ్, జియావోగన్ నగరాల్లో వరద సహాయ పనులు చేపట్టేందుకు చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వి శాఖ రెస్క్యూ సిబ్బందిని పంపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *