25 భాషల్లో చిరంజీవి వెబ్‌సైట్‌

25 భాషల్లో చిరంజీవి వెబ్‌సైట్‌

దేశ వ్యాప్తంగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సేవాకార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు www.chiranjeevi charitable trust.com(చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌.కామ్‌) పేరుతో వెబ్‌సైట్‌ను రామ్‌చరణ్‌ సోమవారం ప్రారంభించారు.

చిరంజీవి జీవితంలో సాధించిన  సినిమాల విశేషాలతో పాటుగా చిరు సేవాకార్యక్రమాలను తెలిపేందుకు www.k.chiranjeevi.com అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ రెండు వెబ్ సైట్ల విడుదల సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘‘20ఏళ్లకు పైగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా.. నాన్నగారిని కలుసుకున్న అభిమానులకు నాన్నగారు ఫొటోలు ఇచ్చేవారు. దీనిలో భాగంగా వారందరిని కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు డోనేషన్ చేసిన వారందరని  భాగస్వాములను చేయాలనే ఆలోచనతో రక్తదానం చేసిన వారికి తన ఫొటో ఇస్తానని చెప్పారు. దీనికి ఆకర్షితులైన అభిమానులు నాన్నగారిని సపోర్ట్‌ చేశారు. చిరంజీవి, అరవింద్‌గారు క్రమంగా ఈ ట్రస్ట్ ను ముందుండి నడిపించారు. అయితే ఈ సేవా కార్యకమ్రాలను కొన్ని రాష్ట్రాల్లో ప్రజలకు సేవలందించేందుకు 25 భాషల ద్వారా వెబ్‌సైట్‌ను రూపొందించి దీని ద్వారా మరింత దగ్గరఅవుతాం. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఆక్సిజన్‌, రక్తం అవసరమైన వారికి అందిస్తాం. దీంతో పాటుగా రక్తదానం, నేత్రదానం చేయాలనుకున్నవారు ఈ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చు. దీని ద్వారా ఎంతో మందికి మేలుకలుగుతుంది. అలాగే హైదరాబాద్‌ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా రక్తదానం చేసేందుకు వీలుగా ఆఫీసులు ఏర్పాటు చేస్తాం అని రామ్‌చరణ్‌ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *