చిరంజీవి కుడి చేతికి సర్జరీ ఎలా అయిందంటే….?

చిరంజీవి కుడి చేతికి సర్జరీ ఎలా అయిందంటే….?

చిరంజీవి కుడి చేతికి సర్జరీ ఎలా అయిందంటే..?

హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికి సేవలు అందించిన అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని విజయవంతంగా సేవలు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మీటింగ్ లో మెగస్టార్ చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ కనపడటం చూసి అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

అభిమానులంతా చిరంజీవిని ఏమైంది ఒక్కసారిగా ప్రశ్నించగా..చిరంజీవి నిదానంగా ఓ చిరు నవ్వు నవ్వి.. తన అరచేతికి చిన్నపాటి సర్జరీ అయింది అనే విషయాన్ని మెగాస్టార్ వెల్లడించారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్ ను సంప్రదించానని తెలిపారు. అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న  మీడియన్ నర్వ్(median nerve) అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్(carpal tunnel syndrome) అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ పేర్కొన్నారు.

ఈ సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందని, అపోలో ఆస్పత్రిలో డాక్టర్ సుధాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సర్జరీ పూర్తి చేసినట్లు చిరంజీవి తెలిపారు. ఈ సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న”గాడ్ ఫాదర్ ” సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ ఇచ్చానని ఆయన తెలిపారు. ఆ సినిమాలో చేయాల్సిన ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసి ఈ 15 రోజులు గ్యాప్ తీసుకుంటున్నాని, నవంబర్ ఒకటో తారీకు నుంచి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చిరు తెలిపారు. మీరు ఇంతలా కష్టపడుతూ, మీ బాడీని కష్టపెడుతున్నారు కాబట్టి ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయి అని ఇక మీదట కుడి చేతికి ఎలాంటి ఇబ్బంది లేదని సుధాకర్ రెడ్డి అన్నారని..ప్రస్తుతానికి అంతా ఇబ్బంది లేదని… కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని అభిమానులతో ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: