ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంటున్న అక్కినేని చైతూ
ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంటున్న అక్కినేని చైతూ
తెలుగు సినిమాలో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య-సమంత తమ పెళ్లి అనే మూడు ముళ్ల బంధానికి గుడ్ బై చెప్పి ఎంతో మంది అభిమానులను నిరాశ మిగిల్చారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా అవి నిజం కాకపోతే బాగుండు అని అటు అక్కినేని సమంత అభిమానులు సహా ఎంతోమంది నెటిజన్లు కోరుకున్నారు. అభిమానులు, నెటిజన్లు నిరాశ పడేలా ఆ వార్తలనే నిజం చేస్తూ.. సమంత, చైతూ ఇక భార్య భర్తలుగా కొనసాగలేమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
విడాకుల తర్వాత సమంత, చైతూ సోషల్ మీడియా అకౌంట్లపై నెటిజన్లు, అభిమానుల ఫోకస్ బాగా పెరిగింది. వీరివురు ఏ విధంగా స్పందిస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా సమంత, చైతూ విడాకుల ప్రకటన తర్వాత నాగ చైతన్య తొలిసారిగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. చైతూ తన మనసులోని మాటలను వెల్లడించారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది..లాట్స్ ఆఫ్ లవ్ అంటూ చైతూ ట్వీట్ చేశారు.
రోడ్డు ప్రమాదానిక గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంతున్న మెగాస్టార్ మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న ట్వీట్ చేశాడు. తనకు యాక్సిడెంట్ తర్వాత చేసిన తొలి ట్వీట్ ఇదే కావడం విశేషం, నెటిజన్లు, అభిమానులను ఉత్సాహపర్చేలా థ్యాంక్స్ అన్నది చిన్నపదమే అంటూ.. త్వరలోనే మీ ముందుకు వస్తానని అంటూ థంబ్స్ అప్ సింబల్ ని చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేశాడు తేజ్.
సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ పై సెలబ్రెటీలు, అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. అందులో భాగంగా అక్కినేని చైతూ స్పందిస్తూ “ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.. ప్రేమతో… అంటూ ట్వీట్ చేశాడు. సమంతతో విడాకుల అనంతరం నాగ్ చేసిన తొలి ట్వీట్ ఇదే కావడం విశేషం.
దేవకట్టా డైరెక్షన్ లో ఇటీవలే విడుదలైన తేజ్ హీరోగా నటించిన “రిపబ్లిక్ చిత్రం” మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది.
Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “
See you soon pic.twitter.com/0PvIyovZn3— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2021