విక్రమ్ ఇన్ “మహాన్” మూవీ..

 విక్రమ్ ఇన్ “మహాన్” మూవీ..

 విక్రమ్ ఇన్ “మహాన్” మూవీ..

ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమర నిర్మాతగా, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో విక్రమ్ హీరోగా మూవీని తెరకెక్కించనున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ పేరు, ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రయూనిట్. తీయబోయే చిత్రానికి టైటిల్ పేరు “ మహాన్” అనే పేరు ఖరారు చేశారు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఈ చిత్రంలో విక్రమ్ ని కొత్త లుక్ తో చూపెట్టారు డైరెక్టర్.. బుల్లెట్ పై విక్రమ్ పొడవాటి జుత్తు, గడ్డంతో చాలా స్టైలిష్ గా కనిపించాడు. డైరెక్టర్ కొత్త కోణంలో విక్రమ్ ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. బుల్లెట్ పై హుందాగా కూర్చొని నవ్వుతూ ఉన్నట్లు పోస్టర్ లో కనిపించాడు హీరో విక్రమ్

అయితే ఈ సినిమాలో విక్రమ్ వెనకాల కొమ్ములు, 16 చేతులు గల ఒక ఆకారం కూర్చొని ఉంది. డైరెక్టర్ కొత్త కోణంతో చూపించేందుకు దేవతా విగ్రహాన్ని పెట్టి.. కథలో సస్పెన్స్ ని క్రియోట్ చేశాడు. విగ్రహం వెనకాల ఉన్న రహస్యం ఏంటి? అని.. దీన్ని తెల్సుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనని డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు. ఇప్పటికే సగ భాగం షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రంపై త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ అభిమానుల సస్పెన్స్ కు త్వరలో తెరపడనుంది. ఈ చిత్రంలో విక్రమ్‌ సరసన సిమ్రాన్‌ నటిస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. విక్రమ్ కి..  60వ చిత్రంగా తెరకెక్కబోతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *