తెలంగాణలోని సినిమా టికెట్ల ధరల పెంపునకు హైకోర్టు ఆదేశం

సినిమా టికెట్ల ధరల పెంచేందుకు థియేటర్లకు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం అనుమతిచ్చింది. దీంతో తెలంగాణలో థియేటర్ల యాజమాన్యాలు ఇటీవల టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వానికి సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ హైకోర్టులోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇట్టి విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది. దీంతో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవలే రిలీజ్ కానున్న అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప తదితర భారీ బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచుతామని థియేటర్ల యాజమన్యాలు తెలిపాయి. దీంతో సినిమా టికెట్లు నిబంధనలకు లోబడి పెరగనున్నాయి.
గత కొన్ని రోజులు ఏపీలో సినిమా టికెట్ల ధరల చుట్టూ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వం టికెట్ల ధరను తగ్గించడం మాత్రమే కాకుండా బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ కేవలం రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. అలాగే టికెట్లు కూడా ఆన్లైన్ లో విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది.