తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్
75వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఆగస్టు16 నుంచి రెండో విడత రుణ మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న రైతుల దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. వారందరి రుణాలను ఆగస్టు 16 నుంచి మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆగస్టు నెలాఖరు నాటికి రుణ మాఫీ ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోనే రుణ మాఫీ డబ్బులను జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు
ఇప్పటికే రూ.25వేల లోపు రుణాలను మాఫీ చేశామని మొదటి, రెండో దశ కలిపి ఈ నెలాఖరు నాటికి మొత్తం 9 లక్షల మంది అన్నదాతలకు రుణ విముక్తి కలగనుందని తెలిపారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు.