కేంద్రంతో ధాన్యాన్ని కొనుగోలు చేయించాలి..కిషన్ రెడ్డికి సవాల్: సీఎం కేసీఆర్

కేంద్రంతో ధాన్యాన్ని కొనుగోలు చేయించాలి..కిషన్ రెడ్డికి సవాల్: సీఎం కేసీఆర్

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని.. దమ్ముంటే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయించేలా కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కేబినెట్ భేటీ అనంత‌రం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక తెలంగాణ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సిపాయిలా పోరాడి కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలంటూ సవాల్‌ విసిరారు. కేంద్ర‌తీరుతో రైతులు గంద‌ర‌గోళం చెందుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏదైన న‌ష్టం వ‌స్తే కేంద్రం భరిం చాలే తప్ప రాష్ట్రాలపై నెట్టకూడదు. సమస్యలు చెప్పుకునేందుకు మంత్రుల బృందంతో ఢిల్లీకి వెళితే కేంద్రం స్పందించలేదని, బీజేపీ మోసకారి ప్రభుత్వం అంటూ విమర్శించారు. బీజేపీ పాలన కంటే కోటిరెట్లు అన్ని రంగాల్లో మంచిపాలన అందిస్తున్నామని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో పచ్చి అబద్ధాలు ఆడుతూ కేంద్రం దిగజారి ప్రవర్తిస్తుంది అంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

కేంద్రం వ‌రి కొన‌క‌పోవ‌డం కార‌ణంగా యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండ‌వ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రైతులు ఇష్టం ఉంటే పంట వేసుకోవ‌చ్చ‌ని అన్నారు. రైతులు నష్టపోవద్దని ధైర్యం గా చెబుతున్నామ‌ని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రతి ఒక్క టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అందిస్తాం అన్నారు.

కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పీయూష్‌ గోయల్‌లు ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతుల మెడపై కత్తిపెట్టి ప్రతీ బోర్‌ దగ్గర మీటర్‌ పెట్టాలని కేంద్రం చెబుతోందన్నారు. కరెంట్‌ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటుందట.. విద్యుత్‌ సంస్కరణల పేరుతో మా మెడ మీద కత్తి పెట్టుడేంది.? అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ వాతావరణం బాయిల్డ్‌ రైసుకే అనుకూలం అని కేంద్రం వద్ద వాదన వినిపించాలని సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *