యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో అయిన నేపథ్యంలో యాదాద్రి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. రేపటి పర్యటనలో మరోసారి సీఎం కెసీఆర్ యాదాద్రి పునర్నిర్మాణం పనులు పరిశీలిస్తారు. గత వారం రోజుల క్రితం చినజీయర్ స్వామిని కలిసినప్పుడు యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని స్వామివారు నిర్ణయించి ఉన్నారు. ఇక రేపు యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారు. యాదాద్రి పుణ్యక్షేత్రం నూతనంగా నిర్మించిన సందర్భంలో.. చేయబోయే మహా సుదర్శన యాగం వివరాలు, తేదీలను కూడా కెసీఆర్ ప్రకటించనున్నారు. కాగా.. ఇప్పుడు వచ్చే డిసెంబర్ మాసంలో యాదాద్రి టెంపుల్ పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆలయ శంకుస్థాపనకు ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చే అవకాశం కూడా ఉందని భక్తులు, రాజకీయ నాయకులు అంటున్నారు.