హుజురాబాద్ లో కేసీఆర్ బహిరంగ సభ ఎప్పుడంటే..?

27న హుజురాబాద్ లో కేసీఆర్ బహిరంగ సభ..?

తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గసమావేశం జరిగింది. ఈ సమావేశం..సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగగా.. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ముందస్తు ఎన్నికలకు మనము వెల్లడంలేదని.. ఈ రెండున్నర ఏళ్లలో ఇంకా చేయాల్సి చాలా ఉందని మంత్రులు, ఎంపీలకు దిశా నిర్ధేశం చేశారు. అయితే ప్రధాన చర్చ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని.. ఈ నెల 27 హుజురాబాద్ లో ప్రచార సభకు తాను వస్తానని ప్రకటించారు. హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో.. ప్రతిపక్షాల అవాక్కులు.. చవాక్కులు పేలుతుర్నాని.. వాళ్లకు దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ ఉండబోతుందని… టీఎర్ఎస్ పై మొరిగే కుక్కలు నక్కల నోర్లు ఆ సభలో మనమే మూయించాలన్నారు.

ఇకపై తెలంగాణ భవన్ లో సర్వ సన్నాహక సమావేశాలు..ప్రతి రోజు 20 నియోజక వర్గాల సమావేశాలు నిర్వహించాలని…ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సారి మనం ముందస్తుకు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉందని.. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా రెండేళ్లు ఉంది అన్ని పనులు చేసుకుందామని.. అయితే ఈ సారి ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *