AP: రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ
ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా రైతుల ఖాతాల్లో జగన్ ఓ క్లిక్ తో నగదు జమ అయింది. ఈ పధకం ద్వారా రైతు భరోసా కింద మొత్తం 12 వందల 13 కోట్లు..అక్టోబర్ నెల ముగిసేలోపు.. రబీ అవసరాల కోసం రూ.4 వేలు చొప్పున జమ చేస్తారు. దీంతో పాటుగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.112.7 కోట్ల వడ్డీ రాయితీ జమ చేశారు.
దీంతో పాటు లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు ఈ పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద 17 వందల 20 రైతు గ్రూపులకు 25.55 కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి.
రైతులు తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు మీసమస్యలతో పాటుగా.. టోల్ ఫ్రీ నెంబర్ 155251కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్.. వైఎస్సార్ రైతు భరోసా వెబ్సైట్ (YSR Rythu Bharosa Website) లో రైతులు తమ ఖాతాల్లో నగదు స్టేటస్ వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంది.