కోల్ ఇండియాలో 588 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

కోల్ ఇండియాలో 588 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
కోల్ ఇండియా లిమిటెడ్ (CICL) లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులు ఇంజినీరింగ్, డిగ్రీ చేసిన వారు మాత్రమే అర్హులు. సెప్టెంబర్ (ఈనెల) 9 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు గేట్-2021 స్కోర్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు సంఖ్య: 588
అత్యధికంగా మైనింగ్ 253, ఎలక్ట్రికల్ 117, మెకానికల్ 134, సివిల్ 57, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 15, జియాలజీ 12 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: మైనింగ్ విభాగంలో ఆయా పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
జియాలజీ పోస్టులకు జియాలజీ, అప్లయిడ్ జియాలజీ, జియోఫిజిక్స్, అప్లయిడ్ జియోఫిజిక్స్లో ఎమ్మెస్సీ, ఎంటెక్లలో ఏదో ఒకటి 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక అనేది ఆన్ లైన్ ద్వారానే ఉంటుందని కోల్ ఇండియా తెలిపింది.
అప్లికేషన్ ఫీజు: రూ.1000 + 180 (జీఎస్టీ), SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 9
వెబ్సైట్: www.coalindia.in
వెబ్సైట్: www.teluguword.com