కాఫీ ఎక్కువగా తాగితే ప్రమాదముందా….!

కాఫీ ఎక్కువగా తాగితే ప్రమాదముందా….!

కాఫీ ఎక్కువగా తాగితే ప్రమాదముందా….!

నిత్య జీవితంలో చాలా మందికి కాఫీ, టీలు బాగా అలవాటుగా అయిపోయింది. అయితే టీ, కాఫీలు అనేవి సాధారణ స్థాయి మానవుడి నుండి ప్రముఖుల వరకు రోజు టీ, కాఫీతోను త్రాగడం ప్రారంభిస్తారు. అయితే టీ, కాఫీ గానీ త్రాగితే మనకు కొంత ఉత్సాహం అనేది వస్తుంది. అయితే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో టిఫిన్ కంటే ప్రాధాన్యత కాఫీ, టీలకు ఎక్కువగా ఇస్తున్నారడంలో సందేహం లేదు.

అయితే పరిగడుపున కాఫీ తీసుకోవడం వల్ల కాఫీలోని “కెఫిన్” అనే పదార్థం జీర్ణ కోశం నుంచి రక్తంలోకి వెళ్లి చాలా తర్వగా వ్యాప్తి చెంది తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రభావం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజు కాఫీలో తక్కువ గాఢత ఉన్న కాఫీ తాగితే హాని కలగదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే టిఫిన్ అయ్యాక కాఫీని, భోజనం అయ్యాక కాఫీని తాగితే హాని కలుగ తప్పదు. అయితే రోజులో ఎక్కువ సార్లు కాఫీ తాగితే మాత్రం అనారోగ్యాన బారిన పడక తప్పదని చెబుతున్నారు. అటువంటి వారికి జీర్ణశక్తి తగ్గిపోవడం, ఆకలి మందగించడం. గ్యాస్టిక్ ప్రాబ్లమ్, కడుపులో మంట, రక్తపోటు (చక్కెర స్థాయిలు నిల్వ హెచ్చు తగ్గులు) గుండె దడ, నిద్ర రాకపోవడం, తలనొప్పిలతో పాటు అనేక రకాల రోగాలు బారిన పడుతున్నారు. అయితే పిల్లలకు మాత్రం కాఫీని పట్టించొద్దని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే పిల్లలో ఎదుగుదల అనేది ఆగిపోతుందట. కాఫీ తాగడం వల్ల చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతోంది. అయితే కాఫీ, టీలు ఎక్కువగా తాగే వాళ్లలో సంతానోత్పత్తి ప్రభావం కూడా ఏర్పడుతుందట.

కాఫీని డయాబెటీస్ పెషేంట్లు తాగొచ్చా:  కాఫీ త్రాగడం వల్ల టైప్-2 డయాబెటిస్ ప్రమాదం నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని అంటున్నారు నిపుణులు. సాధారణంగా ఎవరికైనా టైప్-2 డయాబెటిస్ అనేది మోస్ట్ కామన్ కండీషన్ గా గుర్తిస్తారు. అయితే వీరిలో చెక్కరస్థాయి అనేది తక్కువగా ఉంటుంది. ఇన్స్ లిన్ అనే హార్మోన్ పాంక్రియాస్ చేత తయారువుతుంది. అయితే ఇది గ్లూకోస్ ను పంపించడానికి హెల్ప్ చేస్తుందనే చెప్పాలి. తద్వారా శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. టైప్-2 డయాబెటిస్ అనేది పెద్దలు, చిన్నారులల్లో కూడా వస్తుంది. ఇది ఎక్కువగా సరైన ఎక్సైజ్ లేక పోవడం.. సరైన ఫుడ్ తీసుకోక పోవడం వల్ల జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గర్బిణీలు కాఫీ, టీలు త్రాగొచ్చా: అయితే రోజులో ఒకసారి కాఫీ తాగితే ఏప్రమాదం ఉండదని.. ఎక్కువగా కాఫీ తాగితే..గర్బిణీలలో నీరు, క్యాల్షియం అనేది శరీరంలో నుంచి బయటకు వెళ్లి నీరసం అనేది వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే కాల్షియం తగ్గుదలతో గర్భిణీలోని పిండం ఎదుగుదల, బేబీ గుండె పనితీరు సమస్యలు వస్తాయని చెబుతున్నారు పరిశోధకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *