కొత్తమీరలో ఎన్నో పోషకాలు: సర్వేలో వెల్లడి

కొత్తమీరలో ఎన్నో పోషకాలు: సర్వేలో వెల్లడి

[Best_Wordpress_Gallery id=”1″ gal_title=”All images”]

ఏ కూర వండుకున్నా… చాలా మంది చివర్లో కొత్తి మీర మాత్రం తప్పకుండా వేసుకుంటారు. కూర టేస్ట్ కోసం… మంచి వాసన కోసమే కొత్తిమీర వాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొత్తి మీరలో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయంటున్నారు ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఆహార పంటను వీళ్ళు స్టడీ చేస్తున్నారు. పంటల్లో ఉంటే పోషక విలువలను గుర్తుస్తున్నారు. కొత్తిమీరపై చేసిన పరిశోధనల్లో చాలా విషయాలు బయటపడ్డాయి. కొత్తిమీరను నిత్యం ఆహారంలో వాటం వల్ల శరీరానికి చాలా పోషకాలు అందుతాయి. పైగా కొన్ని రోగాల నియంత్రణకు కూడా కొత్తిమీర పనికొస్తుందని జయశంకర్ వర్సిటీ పరిశోధనకులు గుర్తించారు.

కొత్తిమీరలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులోని మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం కూడా శరీరానికి అందుతాయి. కొత్తమీరలో ఉండే విటమక్ కె తో అల్జీమర్స్ చికిత్సకు, గాయ తగిలితే త్వరగా రక్తం గడ్డకట్టడానికి కూడా ఉపయోగ పడుతుందట. అర్థరైటిస్ లాంటి వ్యాధులను నయం చేయడంతో పాటు… కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ,సీ శరీరానికి కొత్తమీర ద్వారా పుష్కలంగా అందుతాయట. జీర్ణ క్రియకు అవసరమైన బోర్నియోల్, లనయోల్ లు కొత్తమీరలో ఉన్నాయట. డయాబెటీస్ రోగులకు కొత్తమీర ఎంతో మేలు చేస్తుంది. ఎండో క్రైన్ గ్రంథుల్లో ఇన్సులిన్ స్రావం పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

కొత్తమీరలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. పీచు పదార్థం ఉండటం వల్ల ఎన్నో రకాల రోగాలు రాకుండా చెక్ పెడుతుంది. ఎలాగంటే పీచు పదార్థం ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచడానికి తోడ్పడుతుంది. చాలామంది నోరు, నాలుక పూతలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే అతిసారాన్ని కూడా కొత్తిమీర నివారిస్తుంది.

చాలామంది కూరల్లో కొత్తిమీరను వాడుతూనే ఉన్నారు. ఇంకా ఎవరైనా వాడని వాళ్ళుంటే… దాని పోషక విలువలు తెలిశాక వాడటం మొదలుపెట్టాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *