దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కొత్తగా మరో 40వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  కరోనా పెరుగుదలపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ. గడిచిన 24 గంటల్లో 40,120 కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,21,17,826కి చేరిందని.. కోలుకున్న వారి సంఖ్య 42,295 మంది కోలుకున్నారని తెలిపింది.

దేశ వ్యాప్తంగా కరోనాతో రోజుకు 585మంది మృతి చెందుతున్నారని తెలిపింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,30,254కు పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  3,15,20,349 మంది కాగా.. ప్రస్తుతం 385227 మందికి ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని.. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 52,95,82,956 వ్యాక్సిన్లు ప్రజలుకు వేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మరో వైపు మహారాష్ట్ర కరోనాతో నుంచి కోలుకునే లోపులో మళ్లీ అక్కడ డెల్టా కేసులుతో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తోంది. తాజాగా ముంబైలో డెల్టా ప్లస్ వేరియంట్ తో తొలి మరణం సంభవించింది. గత నెలలో జూలై 21న కోవిడ్ భారిన పడిన 63 ఏళ్ల మహిళకు డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ సోకింది. దాంతో ఆమె ఆరోగ్యం క్షీణించి జూలై 27న మరణించింది. మృతురాలి కుటుంబసభ్యుల్లో ఆరుగురు కరోనా బారినపడ్డారు. వారిలో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు తేలింది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ మరణం ఇది రెండవది. గతంలో రత్నగిరికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు డెల్టా ప్లస్ వేరియంట్‌తో చనిపోయింది. ఆమె మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తి.

మరో వైపు బెంగళూరులో కరోనా కలకలం రేపుతోంది. 5 రోజుల వ్యవధిలో 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే 9 ఏళ్ల లో పు చిన్నారులు 106 మంది, 9-10 ఏళ్ల మంది 136 మంది ఉన్నారు. మరో వైపు మిజోరం రాజధాని ఐజ్వాల్ లో కేసులు అధికంగా ఉన్నాయి. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *