కరోనా థర్డ్ వేవ్ పై క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్..!

కరోనా థర్డ్ వేవ్ పై క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్..!

కరోనా థర్డ్ వేవ్ పై క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్..!

కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే..అయితే థర్డ్ వేవ్ పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో దేశ ప్రజలంతా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే..అయితే ఈ థర్డ్ వేవ్ పై గత కొంతకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ మహమ్మారి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ రావొచ్చుననే అంచనాల మధ్య కొంత సస్పెన్స్.. ప్రజల్లో కొంత భయం అనేది ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) కరోనా థర్డ్ వేవ్ గురించి తాజాగా కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. కరోనా సెకెండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ అంత ప్రభావం ప్రజల్లో ఉండకపోవచ్చునని (ICMR)ఐసీఎంఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని.. ఐసీఎంఆర్‌కి చెందిన డాక్టర్ సమిరన్ పాండా తెలిపారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గల జిల్లాల వారీగా కరోనా కేసుల డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారని… అయితే కరోనా వచ్చిన వారిలో ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంటుందని విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని.. కరోనా రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఏర్పడుతుందని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తరువాత కేసులు పెరుగుతూ వచ్చాయన్నారు. దీనిపై ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చే దిశగా ప్రయోగాలు నడుస్తున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *