అక్టోబర్ లో థర్డ్ వేవ్.. ప్రమాదం ఉందన్న NIDM

అక్టోబర్ లో థర్డ్ వేవ్..  ప్రమాదం ఉందన్న NIDM

అక్టోబర్ లో ప్రమాదం పొంచి ఉందన్న NIDM

దేశంలో మరో సారి థర్డ్ వేవ్ తప్పదంటున్న నిపుణులు

అక్టోబర్ నాటికి థర్డ్ వేవ్ 

దేశంలో మరోసారి థర్డ్ వేవ్ తప్పదంటూ తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే అక్టోబర్ నాటికి ఇది మరింత ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదని ప్రధాని కార్యాలయానికి ఓ నివేదిక ఇచ్చారు. అయితే ఇది పెద్దలైనా… పిల్లల కోసం కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో సరిచూసుకొమ్మని ఓ వార్తా సంస్థ కథనాన్ని పేర్కోంది. దీనిపై తేల్చి చెప్పాలంటే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) సారథ్యంలోని నిపుణుల కమిటీ తాజా నివేదిక ప్రకారం వైరస్ నుంచి బయటపడేందుకు సిద్ధం కమ్మని చెబుతోంది. ఇప్పటికే  వివిధ అధ్యయనాలు చెప్పినట్టు కరోనా థర్డ్‌వేవ్‌ రావడం ఖాయమనీ.. అది అక్టోబర్‌ కల్లా..  తారస్థాయికి చేరుకోవచ్చుననీ..ప్రమాద ఘటికలు మ్రోగించే అవకాశం లేకపోలేదని.. ఈ సంఘం ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేసింది.

అయితే దేశంలో వైద్యం చేసేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సుల సహా వసతులే లేవని ఈ నివేదికలో హెచ్చరించింది. దేశంలో ఇతర ఆరోగ్య సమస్యలున్న పిల్లలకూ, మానసిక వికలాంగులకు భవిష్యత్ లో టీకాలు వేయాలని కేంద్రానికి ఈ సంఘం సూచించింది. అక్టోబర్ లో వచ్చే థర్డ్ వేవ్ కు మనం సహజీవనం చేయాల్సిందేనని..ఆ వైరస్ తో పోరాడేందుకు మనం సరికొత్త యుద్ధానికి సిద్ధం కావాల్సిందేనని తేల్చి చెప్పింది.

దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్.. దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ నుంచి రక్షించుకునేందుకు మన యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. చిన్నారులకు టీకాలను ఇచ్చేదిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. చిన్నారులకు టీకాలు ఇచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తోందని.. దేశంలో ఈ వ్యాక్సిన్ సెప్టెంబర్ నుంచి అమలులోకి రానుందని తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో జూలై చివరి వారంలో కరోనా పెరగడాన్ని బట్టి చూస్తే, థర్డ్‌వేవ్‌ ఇప్పటికే విస్తరిస్తోందని నిపుణుల నివేదిక అందరినీ కలవరపరుస్తోంది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. దేశంలో కొంతమందికి కరోనా వస్తూనే ఉంది.. దీని బట్టి చూస్తే టీకాల సత్తాకు మించిన బలమైన, కొత్త వేరియంట్లు థర్డ్‌వేవ్‌లో వచ్చే ముప్పుందనేది నివేదికలు చెప్పకనే చెబుతున్నాయని అర్ధం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *