తెలంగాణలో 170 మంది వైద్య సిబ్బందికి కరోనా ?

తెలంగాణలో 170 మంది వైద్య సిబ్బందికి కరోనా ?

రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. రోజు రోజుకీ హాస్పిటల్స్ లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గాంధీ హాస్పిటల్స్ లోనూ కరోనా బాధితులు చేరుతున్నారు. ఇప్పుడు ఏకంగా గాంధీలో పనిచేస్తున్న 44 మంది సిబ్బందికి కరోనా ఎటాక్ అయినట్టు తెలుస్తోంది. వీళ్ళల్లో 20 మంది MBBS విద్యార్తులు, 10 మంది హౌస్ సర్జన్స్, 10 PG స్టూడెంట్స్, 4 ఫాకల్టీస్ కు పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఉస్మానియా హాస్పిటల్ లోనూ ఎటాక్

హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో 79 మంది సిబ్బందికి కూడా కరోనా ఎటాక్ అయినట్టు సమాచారం. 25 మంది హౌస్ సర్జన్ సిబ్బంది, 23 మంది పీజీ స్టూడెంట్స్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కరోనా సోకినట్టు చెబుతున్నారు. వీళ్ళందరినీ ఐసోలేషన్ లో ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే  గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ లో వైద్య సిబ్బందికి కరోనాపై ఇంకా అధికారులు ధృవీకరించలేదు. ఇంకా నీలోఫర్ లో ఇద్దరు, ENT హాస్పిటల్ లో ఏడుగురికి కూడా కరోనా వచ్చినట్టు తెలుస్తోంది. ఇది కాకుండా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 42 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ప్రస్తుతం కరోనా సోకిన వైద్య సిబ్బంది అంతా కరోనా బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.  కొందరు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *