ఇలాగైతే థర్డ్ వేవ్ గ్యారంటీ…!

ఇలాగైతే థర్డ్ వేవ్ గ్యారంటీ…!

దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందా అంటే… ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో రోజుకి వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ కోవిడ్ కేసులతో పాటు… ఒమిక్రాన్ కూడా విజృంభిస్తోంది. ఈసారి థర్డ్ వేవ్ జనవరి నుంచి మొదలై ఏప్రిల్ దాకా… అంటే నాలుగు నెలలు కొనసాగుతుందని IIT కాన్పూర్ కు చెందిన ప్రొ. మహీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. రోజుకి 1.8 లక్షల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యేఅవకాశం ఉందంటున్నారు. అయితే సెకండ్ వేవ్ లో లాగా… హాస్పిటల్ బారిన పడే వారి సంఖ్య తక్కువగానే ఉండొచ్చని అంటున్నారు ప్రొఫెసర్ అగర్వాల్.

ఎన్నికల ర్యాలీలే సూపర్ స్ర్పైడర్లు

దేశంలో ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈమధ్యే కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఈ ఎన్నికలో గెలుపు కోసం బీజేపీతో పాటు కాంగ్రెస్ ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు పోటా పోటీగా ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా భారీగా ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరుగుతాయి. వీటిల్లో పార్టీల కార్యకర్తలు, సామాన్య జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. దీనివల్ల కరోనా తీవ్రతా బాగా పెరిగే ఛాన్సుంది. అందువల్ల ఇప్పటి నుంచి కనీసం నాలుగైదు నెలలు అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జనం ఎక్కడా తగ్గట్లేదు

ఎప్పుడో వచ్చే ఎన్నికలే కాదు… ఇప్పుడు జనం గుంపులు గుంపులుగా తిరుగుతుండటం కూడా థర్డ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతోంది. డిసెంబర్ 31 నుంచి మొదలైన జనం హడావిడి జనవరి రెండు ఆదివారం దాకా కొనసాగుతోంది. పార్కులు, జూపార్కులు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్లో, ఎంటర్ టైన్ మెంట్ ఏరియాలు… ఇలా అన్ని చోట్లా జనం గుంపులు గుంపులుగా తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడా తగ్గలేదు. మాస్కులు లేకుండా… ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా తిరుగుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఇంకా తీవ్రంగా ఉండే ఛాన్సుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

థర్డ్ వేవ్ వ్యాప్తి ఎలా ఉండొచ్చు ?

ఈసారి కరోనా సోకిన ప్రతి 10మందిలో ఒక్కరికి మాత్రమే హాస్పిటల్ లో చేరే అవకాశముంది. దీర్ఘకాలిక రోగాలు కలిగిన వారు జాగ్రత్తగానే ఉండాలి. మార్చి నెలాఖరు నాటికి దేశంలోని హాస్పిటల్స్ లో 2 లక్షల పడకలు అందుబాటులోకి తేవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో జనానికి రోగ నిరోధకత ఎక్కువ. మ్యూటెంట్ల వల్లే డెల్టా వేరియంట్ వచ్చింది. అయినా దక్షిణాఫ్రికాలో లాగా భారత్ లో వేరియంట్ల ప్రభావం తక్కునని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *