వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో తగ్గిపోతున్న యాంటీ బాడీలు: ICMR

వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో తగ్గిపోతున్న యాంటీ బాడీలు: ICMR

కోవిషీల్డ్, కోవాగ్జిన్ చేయించుకున్న వారికి 2 నెలల్లో తగ్గిపోతున్న యాంటీ బాడీలు.. ICMR నివేదిక

దేశీయంగా కోవిడ్ టీకాలు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 75 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశామని కేంద్రం ప్రకటించింది. దీంతో 2021, డిసెంబర్ కల్లా యువతతో సహా అందరికీ టీకాలు అందేలా చేస్తామని కేంద్రం చెబుతోంది. అయితే కోవాగ్జిన్, కోవిషీల్డ్ తీసుకున్న వారిలో 2 నెలల తరువాత యాంటీ బాడీలు తగ్గిపోతున్నాయని సైంటిస్టులు తాజాగా చేసిన ప్రయోగాల్లో వెలుగులోకి వచ్చాయి.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరి 3 నెలల తరువాత యాంటీబాడీలు, కోవాగ్జిన్ 2 డోసులు తీసుకున్న ప్రతి ఒక్కరిలో 2 నెలల తరువాత యాంటీ బాడీలు తగ్గిపోతున్నాయని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇది కొద్ది కాల పరిమితి స్టడీ అని 6 నెలల తరువాత రిజల్ట్ ఎలా ఉంటుందనేది వేచిచూడాలని సైంటిస్టులు అంటున్నారు. అలాగే సంవత్సం తరువాత ఈ టీకాలు తీసుకున్న వారిలో యాంటీ బాడీలు ఉన్నాయా, లేవా అనే విషయంపై పరిశీలించాల్సి ఉంటుందని, అప్పుడు వారిలో ఏవిధంగా ఉంటుందో చూసి బూస్టర్ డోస్ వేయాలా వద్దా అనే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ దేవదత్త్ భట్టాచార్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతానికి 614మందిని పరిశీలించిన పిమ్మట ఈ రిజల్టు వచ్చిందని తెలిపారు. వీరిలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు తీసుకున్నారని తెలిపారు. వీరి రిజల్ట్సులో మార్పులను గమనించామని తెలిపారు. మరళా 6 నెలల తరువాత వీరిని పరీక్షించి… అప్పుడే బూస్టర్ డోస్ పై ఆలోచిస్తామని తెలిపారు.

ప్రస్తుతానికి దేశీయంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటుగా స్పుత్ నిక్ వి టీకాను అందుబాటులో ఉన్నాయి.. ప్రతి ఒక్క వ్యాక్సిన్ ను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం కొత్త వ్యాక్సిన్లు కూడా అనుమతినిచ్చింది. వాటిలో జైడస్ కాడిలాకు చెందిన జైకోవ్-డీని 3 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. విదేశీయంగా తయారైన వ్యాక్సిన్లు కూడా మనదేశంలోకి అనుమతిస్తున్నారు. దీంతో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు అందించాలన్నదే కేంద్రం లక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *