పత్తి రైతులకు గుడ్ న్యూస్‌..! ఈసారి క్వింటాల్‌ ధర ఎంతో తెలుసా..?

పత్తి రైతులకు గుడ్ న్యూస్‌..! ఈసారి క్వింటాల్‌ ధర ఎంతో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నవర్షాల కారణంగా పత్తి పొలాల్లోనే చాలా దెబ్బతిన్నది. దీంతో రైతు చాలా నష్టపోయాడు. దీంతో కాసిన కొద్ది పత్తికి మార్కెట్లో పత్తికి చాలా డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు పత్తిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.

కార్తీక మాసం సందర్భంగా మన హిందువులు పత్తిని బాగా కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పండుగల సందర్భంగా రానున్న కొద్ది రోజుల్లో పత్తి ధర క్వింటాలుకు రూ.10 వేలకు పైగా  చేరే అవకాశం ఉందని అంచనా వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా పత్తికి తక్కువ ఉత్పత్తి వస్తుంది. కానీ పత్తికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో వ్యాపారులు పత్తిని అధికంగా కొనుగోలు చేస్తున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం ప్రైవేట్ పత్తి వ్యాపారులు పత్తి క్వింటాల్‌కు రూ.8,300 నుంచి 8,500 వరకు కొంటున్నట్లు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ పలుకుతోంది. మహారాష్ట్రలో రైతులకు క్వింటాల్‌కు పత్తి ధర రూ.9000 వరకు లభిస్తోంది. పత్తి ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.6,250. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభించడంతో రైతుల్లో ఆనందం కలుగుతోంది. వర్షం కారణంగా పత్తి పంటలు దెబ్బతినే సరిగికి రైతులు ఆందోళనకు గురయ్యారు.

ప్రస్తుతం పత్తికి మంచి ధర రావడంతో ఆనందపడుతున్నారు. మరోవైపు ధరలు పెరుగుతాయన్న వార్తలతో రైతులు పత్తిని నిల్వ చేస్తున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ధర.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెరగవచ్చని అంచనా. దీంతో రైతులు లబ్ధి పొందుతున్నారు. దిగుబడి తక్కువగా ఉండడంతో రైతులకు మంచి ధర వస్తుందని ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *