TS: CPGET ఈనెల 28 వరకు పొడిగింపు

TS: CPGET ఈనెల 28 వరకు పొడిగింపు

TS:  CPGET ఈనెల 28 వరకు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్​‍ టెస్ట్‌ (సీపీజీఈటీ) – 2021కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడగింపు. అయితే రెండు రోజుల పాటు వెబ్‌సైట్‌ పనిచేయలేదని సీపీజీఈటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. అయితే విద్యార్థుల సౌకర్యార్థం 2 రోజుల పాటు పొడిగించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ గడువును ఈ నెల 28 వరకు పొడిగించినట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 6 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో వచ్చే నెల 12వ వరకు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చుని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం సుమారు 60 వేల దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: