ఆర్యన్ ఖాన్ విడుదలకు రూ.25కోట్లు డిమాండ్..!

దేశ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ మారిన న్యూస్..ముంబైలోని క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ సేవించి పార్టీ చేసుకుంటూ పోలీసులకు దొరికిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. అయితే బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫీ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ ను విడుదల చేయాలంటే రూ.25 కోట్లు డిమాండ్ చేశారని సాక్షి ఆరోపించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారుల పైనే ఆరోపణలు చెప్పడం వల్ల కేసులో మరింత దుమారం లేపాయి. ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టేందుకు ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తరపున రూ.25 కోట్లు డిమాండ్ చేశారని సాక్షి ఆరోపించారు.

అయితే, తమపై వస్తోన్న కొత్త, కొత్త ఆరోపణల్ని ఖండిస్తోన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డ్రగ్స్ కేసులో తన పని తాను చేసుకుపోతోంది. ఆర్యన్ ఖాన్‌తో పాటూ ఇతర నిందితుల డిలీటెడ్ మెసేజెస్ తిరిగి రాబట్టేందుకు నిపుణుల సాయం తీసుకుంటున్నారు అధికారులు. అలాగే, ఆర్యన్ ఖాన్ బ్యాంక్ లావాదేవీలు కూడా ఎన్సీబీ చెక్ చేయనుంది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఏమైనా ఖరీదు చేయటం జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ  అసంతృప్తిగా ఉంది. దీనిపై స్పందించిన సీఎం ఉద్ధవ్ ధాక్రే ఎన్సీబీ అధికారులు కోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియాను వదిలిపెట్టి గ్రాముల్లో డ్రగ్స్ తీసుకునే వారిని, సెలబ్రిటీల్ని టార్గెట్ చేస్తోందని బహిరంగంగానే ఆరోపించారు. ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను బయటపడేసేందుకు షారుక్ ఖాన్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా ఆర్యన్ కు కనీసం బెయిల్ కూడా లభించడం లేదు. ఇలాంటి తరుణంలో ఎన్సీబీ సాక్షి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *