ప్రకృతి మనకు కాలానుగుణంగా ఎన్నో రకాల పండ్లు మనకు అందిస్తుంది. వర్షాకాలంలో వినాయక చవితి తరువాత విరివిగా దొరికే సీతాఫలం రుచిని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. పోషక విలువలు అధికంగా ఉండే సీతాఫలం పళ్ళు వర్షాకాలం ప్రారంభమవ్వగానే మార్కెట్లో బాగా కనబడతాయి.
ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్నీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. ఎన్నో ఖనిజాలు, విటమిన్లు మరియు అనామ్లజనకాలతో పాటు అత్యధిక పీచు పదార్ధాలతో సమృద్ధిగా ఉండే సీతాఫలం మన ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుంది.
అంతేకాదు ఎన్నో సౌందర్య గుణాలు కలిగిన పండ్ల జాబితాలో ఈ సీతాఫలం ముందు వరుసలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ మొదలగు రాష్ట్రాలలో సీతాఫలం ఎక్కువగా పండుతుంది. ఈ పండులో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలతో పాటు కొన్ని హానికరమైన గుణాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రుచికరమైన సీతాఫలం(Custard apple) పండ్లు చూడగానే నోరూరుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పండ్లను ఆవురావురమంటూ తినేస్తుంటారు. సీతాఫలం కాయలు మధురమైన రుచితో పాటు మెండుగా పోషక ప్రయోజనాలను అందిస్తాయి.
అలాగే సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న మహిళలు సీతాఫలం తరచుగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
డెలివరీ తర్వాత సీతాఫలం తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గర్భిణీలు సీతాఫలం తినడం ద్వారా తమ పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుంది. అలసట నుంచి దూరం చేయడంతో పాటుగా ఆకలి కోరికను నివారిస్తుంది.
ఈ పండు తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి స్కిన్ మెరుస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సీతాఫలం సహాయపడుతుంది. రక్తహీనత అనే సమస్య దరిచేరదు.
ఈ పండులో యాంటీ ఒబెసియోజెనిక్ (anti-obeseogenic), యాంటీ డయాబెటీస్, క్యాన్సర్ నిరోధక బయోయాక్టివ్ మాలిక్యూల్స్ ఉంటాయి
సీతాఫలం అరుగుదలకు సహకరించే ఫైబర్ సీతాఫలంలో సమృద్ధిగా ఉంటుంది. జీవక్రియ ఆరోగ్యం కోసం కూడా సీతాఫలాలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
సీతాఫలంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి దీంతో కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ముఖ్యంగా కంటిశుక్లాలు సమస్యలు దరిచేరవు.
మధుమేహ సమస్య ఉన్నవారు పోషకాహార నిపుణులు సీతాఫలం తినొచ్చని చెబుతున్నారు. ఈ సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (glycemic index) తక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ కాలానుగుణ పండ్లను ఏ భయం లేకుండా తినొచ్చు.
సీతాఫలం లావుగా ఉన్నవారు కూడా సుభ్రంగా లాగించేయొచ్చని ఆరోగ్య నిపుణు చెబుతున్నారు. ఈ పండులో ఎలాంటి కొవ్వులు ఉండవు. అందుకే కాస్త బొద్దుగా ఉన్న వారు కూడా సీతాఫలం రుచిని ఆస్వాదించవచ్చు. సీతాఫలంలో మాంగనీస్, విటమిన్ సి వంటి మినరల్స్ అధికంగా ఉండటం వల్ల గుండె, రక్తప్రసరణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఆరోగ్య నిపుణల సలహాల మేరకు ఈ పండును తినాలని సూచిస్తున్నారు.