ఆ మండలాల్లో దళిత బంధు పథకం

ఆ మండలాల్లో దళిత బంధు పథకం

  ఆ మండలాల్లో దళిత బంధు పథకం

దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతా విస్తరింప చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. దీనిలో భాగంగా తొలుత పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌ నుంచే మొదలు పెట్టారు. అయితే ఈ పథకాన్ని రాష్ట్రమంతా విస్తరింప చేయాలన్న సంకల్పంతో ప్రస్తుతం 4 మండలాల్లో దళిత బంధును అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా  రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 నియోజక వర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు

జిల్లాల్లోని మండలాలు ఇవే

ఖ‌మ్మం జిల్లా, మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం, చింత‌కాని మండ‌లం

సూర్యాపేట జిల్లా, తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం, తిరుమ‌ల‌గిరి మండ‌లం

నాగర్‌క‌ర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం, చార‌గొండ మండ‌లం

కామారెడ్డి జిల్లా, జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం, నిజాం సాగ‌ర్ మండ‌లం

ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. . అయితే ఈ నిర్ణయంపై సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి సమీక్ష చేసిన తరువాత ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *