ఆ భాగంలో న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే తెల్ల‌గా మారుతుంది..!

ఆ భాగంలో న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే తెల్ల‌గా మారుతుంది..!

ఆ భాగంలో న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే తెల్ల‌గా మారుతుంది..!

మానవ శ‌రీరంలో అనేక భాగాల్లో సాధార‌ణంగా చాలా మందికి న‌ల్ల‌గా అవుతుంటుంది. ఆయా భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డంతో ఇబ్బందులు ప‌డుతుంటారు.మఖ్యంగా తెల్లగా ఉన్న వారి మెడ భాగంలో నల్లగా అయితే చూపురులకు చాలా అసహ్యంగా ఉంటుంది.

శ‌రీరంలో అనేక భాగాల్లో సాధార‌ణంగా చాలా మందికి న‌ల్ల‌గా అవుతుంటుంది. ఆయా భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డంతో అనేక ఇబ్బందులు ప‌డుతుంటారు.  ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ‌గా ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంది. అయితే కొంద‌రికి మెల‌నిన్ (మెలనిన్ అనేది వర్ణద్రవ్యం, ఇది మానవులతో సహా చాలా జంతువుల చర్మంలో మెలనోసైట్స్ అని పిలువబడే కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ వర్ణద్రవ్యం వ్యక్తి జన్యు అలంకరణను బట్టి వివిధ షేడ్స్‌లో వస్తుంది. మెలనిన్ రెండు ప్రాథమిక రూపాల్లో వస్తుంది పసుపు-ఎరుపు నుండి ముదురు గోధుమ రంగు వరకు ఉంటుంది. ఇది మానవుల్లో ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయినా ఈ విధంగా జ‌రుగుతుంటుంది.

చాలా మందికి మెడ భాగంలో న‌ల్ల‌గా అవుతుంది. అలాంటి వారు దిగులు చెందాల్సిన ప‌నిలేదు. కింద తెలిపే చిట్కాలను వాడితే తమ మెడ భాగాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఇది ఎక్కువగా ఆడవారిలో జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్లలో మెటబాలిజం, మెడ భాగంలో రోల్డు గోల్డు వేస్తే మెడభాగం నల్లగా అయ్యే ఛాన్సెన్స్ ఎక్కువగా ఉన్నాయి. అక్క‌డ ఉండే న‌లుపుద‌నం పోతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.

మీకు కావాల్సిన పదార్ధాలు:  2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, శనగ పిండి, పసుపు, బంగాళ దుంప జ్యూస్, పెరుగు

తయారీ విధానం:  2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, శనగ పిండి, అంతే మోతాదులో శ‌న‌గ‌పిండితో పాటుగా పెరుగును తీసుకోవాలి. శ‌న‌గ‌పిండి వ‌ద్ద‌నుకుంటే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. దీంతో పాటుగా చిటికెడు ప‌సుపు, 1 టీస్పూన్ బంగాళా దుంప జ్యూస్ ను కూడా తీసుకోవాలి.

తయారీ విధానం: పైన చెప్పిన విధంగా అన్నింటినీ ఒక గాజు బౌలు, లేక ప్లాస్టి, బాండిలో బాగా క‌లిపి పేస్ట్ లా చేయాలి. దీన్ని మెడ ముందు, వెనుక భాగాల్లో చేతితో లేదా బ్ర‌ష్‌తో రాయాలి. ఆ త‌రువాత 15-20 నిమిషాల పాటుగా ఉంటే మనం రాసినదంతా ఆరిపోతుంది. అనంత‌రం చేతిని చల్లనీ నీటిలో త‌డిపి దాంతో మెడ వెనక, ముందు భాగాల్లో సున్నితంగా, వృత్తాకారంలో మ‌సాజ్ మెల్లగా చేయాలి. ముఖానికి రాసుకున్న మిశ్రమాన్ని చాలా చిన్నగా చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి.

చిట్కా-2

కావాల్సిన పదార్ధాలు:  బాదం పొడి, తేనే, పాలపొడి

తయారీ విధానం: ముందుగా బాదంను పొడి చేసుకొవాలి, ఒక స్పూన్ తేనే, దీనికి ఒక స్పూన్ పాల పొడి వేసి మూడింటిని మిశ్రమంగా చేసి వాటిని 5 నిమిషాల పాటు ఫ్రిజులో ఉంచాలి. 15 నిమిషాల తరువాత సుతిమెత్తగా మెడకు రాసుకొని మర్ధన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేస్తే.. ఒక 15 రోజుల్లోనే మీ మెడ రంగు సహజ స్థితికి వస్తుంది.

చిట్కా-3 

ఈ భూ ప్రపంచం మీద కలబంద బతకని ప్రదేశం ఉండదు. దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. షుగర్, గైనిక్, గడ్డలు దగ్గర నుంచి ఇలా ఎన్నో రోగాలను అరికట్టించడంలో కలబంద ఎంతో ఉపయోగపడుతుంది.

కావాల్సిన పదార్థాలు: కలబంద గుజ్జు, చల్లటి నీరు

ముఖ్యంగా చర్మానికి తేమను అందించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు కలబంద గుజ్జును మెడకు ప్యాక్ వేసుకోవాలి. 20 నిముషాల పాటుగా మృదువుగా మర్దన చేసి చల్లని నీటితో శుభ్రం చేసుచేసుకుంటే మీకే తెలుస్తుంది. అయితే ఇది శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది.

చిట్కా-4

కావాల్సిన పదార్థాలు: పచ్చిపాలు, దూది, శనగ పిండి, బియ్యం పిండి, తేనే

ముందేగా పచ్చి పాలను తీసుకుని దూదిని పాలల్లో ముంచి.. ఆ పాలను మెడ మీద నలుపు ఉన్న ప్రాంతంలో రుద్దాలి..ఆ తర్వాత శనగపిండి, బియ్యంపిండి తేనే కలిపినా మిశ్రమాన్ని అప్లై చేసి.. కొంచెం సేపటి తర్వాత చల్లటి నీటితో కడిగితే నలుపు తగ్గుతుంది.

ఇలా వారంలో 2 సార్లు చేస్తుంటే మెడ‌పై ఉండే న‌లుపు పోతుంది. మీ మెడ పూర్వ స్థితిని పొందుతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. దీంతో చూపురులకు చాలా చక్కగా కనపడతారు. మా చిట్కాలను ట్రై చేసి చూడండి మరీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *