తెలంగాణలో అక్టోబర్ 6 నుంచి దసరా సెలవులు
రేపటి నుంచి దసరా సెలవులు
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం (6-10-2021) నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వాలని స్కూళ్లకు ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ. ఈ నెల తిరిగి మరలా 18న స్కూళ్లు తెరవాలని నిర్ణయించారు.
అక్టోబర్ 13 నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
జూనియర్ కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి సెలవులివ్వాలని నిర్ణయించింది. అయితే దసరా సెలవుల్లో ఎలాంటి క్లాసులు నిర్వహించొద్దని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ నియమ నిబంధనలను పాటించకపోతే కఠినచర్యలు ఉంటాయని బోర్డు హెచ్చరించింది. 13 నుంచి 16 వరకు 4 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులు ధ్రువీకరించారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన విద్యాసంస్థలు.. దాదాపు 18 నెలల తర్వాత తిరిగి తెరుచుకున్న సంగతి తెలిసిందే.. కోవిడ్ సమయంలో అంతా ఆన్‌లైన్‌కే పరిమితం కాగా..ఈ మధ్యే భౌతికతరగతులు ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే.