అక్టోబర్ 7నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు
అక్టోబర్ 7నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై రోజుకు 10వేల మందికి అనుమతి
12న మూలా నక్షత్రం రోజున విశేష పూజలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి తెలిపారు.
ప్రతి రోజు జరిగే అమ్మవారి కార్యక్రమాల వివరాలు:
7-10-2021 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణలో శ్రీ దుర్గాదేవి అవతరాం
8-10-2021 విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా అలంకరించబడుతుంది.
9-10-2021 తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు
10-10-2021 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనం
11-10-2021 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవిగా అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం
12-10-2021 శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం)రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, మూలా నక్ష్రతం రోజున ప్రత్యేక పూజలు అందుకోనున్న అమ్మవారు. ఆరోజు వేలాదిగా తరలిరానున్న భక్తజనం.
13-10-2021 శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి) అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్న అమ్మవారు
14-10-2021 శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి) అవతారంలో భక్తులకు దర్శనం
15-10-2021 శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి)రోజున ప్రత్యేక పూజలు చేయనున్న ఆలయ కమిటీ సభ్యులు
11-10-2021 తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపిన ధర్మకర్తల మండలి సభ్యులు
15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవంతో ముగియనున్న కార్యక్రమం.. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వేలాదిగా తరలిరానున్న భక్తజన బృందం.