ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. పీజీ ఒకే ఏడాదే…!

ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. పీజీ ఒకే ఏడాదే…!

ఇకపై కేంద్రం డిగ్రీ నాలుగేళ్ల కోర్సులను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. గతంలో ఇలాంటి ప్రయత్నం చేసినా.. కొన్ని విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన కేంద్రం. ఇప్పుడు మాత్రం నాలుగేళ్ల డిగ్రీ, పీజీ ఒకే ఏడాది పెట్టేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో వ‌చ్చే విద్యా సంవ‌త్సరం నుంచి ఇది అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మూడేళ్ల డిగ్రీకి బదులుగా కొత్త డిగ్రీ కోర్సులు ఇక అమ‌ల్లోకి రానున్నాయి.

దీంతో విద్యార్థులు మూడేళ్ల డిగ్రీతో పాటుగా, కొత్తగా ఇవ్వబోయే కోర్సు నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు..రెండేళ్లకు బ‌దులు ఏడాది కాల‌ప‌రిమితితో పోస్టు గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసే వెసులుబాటు ఉంది.. పూర్తిగా మూడేళ్ల డిగ్రీని రద్దు చేయరు. ప్రస్తుతానికి ఆ మూడేళ్ళ డిగ్రీపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ పరిస్థితి లేదనే అంటున్నారు అనుభవం ఉన్న అధ్యాపకులు. ఎందుకంటే.. ఓవైపు మూడేళ్ల డిగ్రీ కోర్సులను నిర్వహిస్తూనే, నాలుగేళ్ల డిగ్రీని నిర్వహించే అవకాశం కల్పిస్తోంది కేంద్రం. దీంతో విద్యార్థుల్లో కొంత అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు విద్యార్ధులు, అధ్యాపకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *